Share News

Security Drill: రేపే సెక్యూరిటీ డ్రిల్.. కేంద్ర హోంశాఖ కీలక సమావేశం..

ABN , Publish Date - May 06 , 2025 | 12:29 PM

Security Drill: రేపటి సెక్యూరిటీ మాక్ డ్రిల్‌పై అన్ని రాష్ట్రాల సీఎస్‌లతో హొం శాఖ కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా దాడులకు అవకాశం ఉన్న జిల్లాలను మూడు కేటగిరీలుగా విభజించారు.

Security Drill: రేపే సెక్యూరిటీ డ్రిల్.. కేంద్ర హోంశాఖ కీలక సమావేశం..
Pahalgam terror attack

జమ్మూకాశ్మీర్ పహల్గామ్‌లో చోటుచేసుకున్న ఉగ్రదాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తం అయింది. పాకిస్తాన్‌తో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించడానికి సిద్దమైంది. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా సెక్యూరిటీ డ్రిల్స్‌ను నిర్వహిస్తోంది. రేపు(బుధవారం) అన్ని రాష్ట్రాలతోపాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లో కూడా సెక్యూరిటీ డ్రిల్ నిర్వహించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. 1971లో ఇండియా, పాకిస్తాన్ యుద్ధం సందర్భంగా సెక్యూరిటీ డ్రిల్ నిర్వహించారు. దాదాపు 40 సంవత్సరాల తర్వాత దేశంలో సెక్యూరిటీ డ్రిల్ నిర్వహిస్తున్నారు.


హోంశాఖ కీలక సమావేశం

రేపటి సెక్యూరిటీ మాక్ డ్రిల్‌పై అన్ని రాష్ట్రాల సీఎస్‌లతో హొం శాఖ కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా దాడులకు అవకాశం ఉన్న జిల్లాలను మూడు కేటగిరీలుగా విభజించారు. ప్రధాని నివాసం, త్రివిధ దళాల హెడ్ క్వార్టర్స్ ఉండడంతో కేటగిరి 1లో దేశ రాజధాని ఢిల్లీ, తారాపూర్ అణు కేంద్రం ఉన్నాయి. కేటగిరి 2లో విశాఖపట్నం, హైదరాబాద్‌లు ఉన్నాయి. రేపు మొత్తం 259 జిల్లాలలో మాక్ డ్రిల్స్ నిర్వహించనున్నారు. మెట్రోలు, రక్షణ సంస్థలు, కీలక ప్రాజెక్టుల రక్షణ పైన రేపు మాక్ డ్రిల్ జరగనుంది.


ఇవి కూడా చదవండి

Success Story: ఒకే ఒక్కడు.. 78 ఏళ్ల చరిత్రను తిరగరాశాడు..

Pakistan: పాకిస్తాన్‌కు ఊహించని ఎదురు దెబ్బ.. ఫలితం లేకుండా పోయిన UNSC మీటింగ్

Updated Date - May 06 , 2025 | 03:37 PM