Nimisha Priya: నిమిషప్రియకు క్షమాభిక్ష ప్రసక్తే లేదు..
ABN, Publish Date - Jul 17 , 2025 | 06:13 AM
కేరళ నర్సు నిమిషప్రియకు క్షమాభిక్ష ప్రసక్తే లేదని యెమెన్‌కు చెందిన మృతుడు తలాల్ మెహదీ సోదరుడు అబ్దుల్ ఫతా మెహదీ స్పష్టం చేశారు.
యెమెన్ మృతుడి సోదరుడి స్పష్టీకరణ
న్యూఢిల్లీ, జూలై 16: కేరళ నర్సు నిమిషప్రియకు క్షమాభిక్ష ప్రసక్తే లేదని యెమెన్‌కు చెందిన మృతుడు తలాల్ మెహదీ సోదరుడు అబ్దుల్ ఫతా మెహదీ స్పష్టం చేశారు. 2017లో తలాల్ మెహదీని హత్య చేసిన కేసులో నిమిషప్రియకు యెమెన్ ప్రభుత్వం మరణ శిక్ష విధించిన సంగతి తెలిసిందే. బుధవారం ఆమెకు శిక్షను అమలు చేయాల్సి ఉండగా.. దాన్ని వాయిదా వేశారు. ఈ క్రమంలో మృతుడి సోదరుడు స్పందిస్తూ.. నిమిషప్రియను క్షమించే ప్రసక్తే లేదన్నారు. ఆమెకు మరణ శిక్షను అమలు చేయాలని కోరారు. మరోవైపు నిమిషప్రియను కాపాడేందుకు భారత ప్రభుత్వం, కొన్ని సంస్థలు తీవ్ర ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. మృతుని కుటుంబ సభ్యులను ఒప్పించడమే మత పెద్దలకు, అధికారులకు సవాలుగా మారింది. వారు అంగీకరిస్తే ఎంత మొత్తంలో ‘బ్లడ్ మనీ’ ఇవ్వాలన్న దానిపై చర్చలు జరపనున్నారు.
Updated Date - Jul 17 , 2025 | 06:13 AM