Railway Tickets: కౌంటర్ రైలు టిక్కెట్ల కంటే ఆన్‌లైన్ టిక్కెట్స్ ఎందుకు ఎక్కువ రేటు.. మంత్రి క్లారిటీ
ABN, Publish Date - Feb 10 , 2025 | 05:27 PM
ఇండియాలో కౌంటర్ రైలు టిక్కెట్ల కంటే, ఆన్‌లైన్ టిక్కెట్ బుకింగ్స్ ఖరీదైనవిగా ఉంటున్నాయని అనేక మంది ప్రయాణికులు అంటున్నారు. ఈ క్రమంలోనే ఇటివల ఈ అంశంపై ఓ ఎంపీ రాజ్యసభలో ప్రస్తావించగా, కేంద్ర రైల్వే శాఖ మంత్రి క్లారిటీ ఇచ్చారు.
దేశంలో రైల్వే టికెట్ (Railway Tickets) బుకింగ్ ప్రక్రియ గత కొన్ని సంవత్సరాలుగా పూర్తిగా మారిపోయిందని చెప్పవచ్చు. గతంలో ప్రయాణికులు టికెట్లను కౌంటర్ వద్ద పోటీపడి నిలబడి, కొనుగోలు చేసేవారు. కానీ ప్రస్తుతం మాత్రం డిజిటల్ వ్యవస్థ పెరగడంతో ఆన్‌లైన్ టిక్కెట్ బుకింగ్ ప్రక్రియ పూర్తిగా మారిపోయింది. అయితే ఈ కొత్త ఆన్‌లైన్ సౌకర్యం ద్వారా కౌంటర్ టిక్కెట్లతో పోల్చితే కొంచెం ఖరీదైనవిగా మారాయని, అనేక మంది ప్రయాణికులు అనుకుంటున్నారు.
ఎందుకు ఖరీదైనవి
కౌంటర్ ద్వారా టికెట్ తీసుకున్న ప్రయాణికులు, ఆన్‌లైన్ టిక్కెట్ల ఎక్కువ ధరలను చూసి ఆశ్చర్యపోతున్నారు. ఈ విషయాన్ని ఇటీవల సంజయ్ రౌత్ (శివసేన) రాజ్యసభలో ప్రస్తావించారు. ఆయన ఆన్‌లైన్ టిక్కెట్లు, కౌంటర్ టిక్కెట్ల కంటే ఎక్కువ ధరలు ఎందుకు ఉంటున్నాయని ప్రశ్నించారు. దీనిపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ (ashwini vaishnav) స్పందించారు.
ఈ ఖర్చుల కారణంగా..
ఆన్‌లైన్ టిక్కెట్లు IRCTC (ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) ద్వారా మాత్రమే బుక్ చేయవచ్చు. ఇది ఒక అధికారిక వెబ్‌సైట్, యాప్. ఇది టికెట్ బుకింగ్ ప్రక్రియను సులభతరం చేస్తుంది. కానీ ఈ సౌకర్యాన్ని అందించడానికి IRCTC చాలా ఖర్చులు చేస్తుంది. సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్, వెబ్‌సైట్ నిర్వహణ, సర్వర్ విస్తరణ, సెక్యూరిటీ మెజర్లు ఇలా ఎన్నో ఖర్చులు ఉంటాయి. ఈ ఖర్చులన్నింటిని భర్తీ చేయడానికి IRCTC సౌకర్య రుసుం (Convenience Fee) వసూలు చేస్తుంది.
ప్రయాణికులకు ప్రయోజనాలు..
దీంతోపాటు రైల్వే శాఖ ప్రయాణికుల నుంచి వస్తువులు సేవల పన్ను (GST) కూడా వసూలు చేస్తుంది. ఇది భారత ప్రభుత్వానికి చేరుతుంది. దీంతో ఆన్‌లైన్ టిక్కెట్ల ధరలు ఎక్కువగా ఉంటున్నాయని రైల్వే శాఖ మంత్రి స్పష్టం చేశారు. ఈ రెండు అదనపు ఛార్జీలు కలిపి ఆన్‌లైన్ టిక్కెట్ల ధరను కౌంటర్ టిక్కెట్ల కంటే ఎక్కువ చేస్తాయన్నారు. అయితే ఈ ఖర్చులు ప్రయాణికులకు ప్రయోజనాలు కూడా అందిస్తున్నాయన్నారు. ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ ద్వారా ప్రయాణీకులు టికెట్లను ఈజీగా పొందే అవకాశాన్ని పొందుతున్నట్లు చెప్పారు.
80% మంది ప్రయాణికులు
భారతదేశంలో ప్రస్తుతం 80% మంది ప్రయాణికులు IRCTC ద్వారా ఆన్‌లైన్ టికెట్లు బుక్ చేసుకుంటున్నారని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. దీని ద్వారా ప్రయాణీకులు తమ సమయాన్ని ఆదా చేసుకోవడంతోపాటు ముందుగా బుక్ చేసుకుంటే డిస్కౌంట్ కూడా వస్తుందన్నారు. ఈ క్రమంలో ప్రయాణికులు వారి ఖర్చులను తగ్గించుకుంటున్నట్లు చెప్పారు కేంద్ర మంత్రి. ఆన్‌లైన్ టిక్కెట్ల సౌకర్యం కారణంగా భారత రైల్వే సంస్థకు ప్రయాణీకుల నుంచి భారీ ఆదాయం వస్తుంది. ఈ క్రమంలో పలువురు ప్రయాణికులు ఆన్ లైన్ టిక్కెట్లపై విధించే జీఎస్టీని తగ్గించాలని కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి:
Viral News: సోడా సేవించి ముగ్గురు మృతి.. రంగంలోకి పోలీసులు
Next Week IPOs: ఈ వారం కీలక ఐపీఓలు.. మరో 6 కంపెనీల లిస్టింగ్
BSNL: రీఛార్జ్‌పై టీవీ ఛానెల్‌లు ఉచితం.. క్రేజీ ఆఫర్
Gold and Silver Rates Today: రెండు వేలకుపైగా పెరిగిన గోల్డ్.. వెండి ధర ఎలా ఉందంటే..
8th Pay Commission: ప్యూన్ నుంచి ఆఫీసర్ జీతాలు ఎలా పెరుగుతాయంటే.. నెలకు లక్షకుపైగా
Read More Business News and Latest Telugu News
Updated Date - Feb 10 , 2025 | 05:28 PM