ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

What is a Cloudburst: జమ్మూకాశ్మీర్‌లో క్లౌడ్ బరస్ట్‌ల విలయం.. అసలెందుకిలా జరుగుతోంది..

ABN, Publish Date - Aug 17 , 2025 | 02:05 PM

What is a Cloudburst: తక్కువ సమయంలో కురిసే అన్ని భారీ వర్షాలను క్లౌడ్ బరస్ట్‌లు అనలేము. కొన్ని వాతావరణ పరిస్థితులు ఉంటేనే క్లౌడ్ బరస్ట్ అంటాము.

What is a Cloudburst

జమ్మూకాశ్మీర్‌లో గత కొన్ని రోజుల నుంచి క్లౌడ్ బరస్ట్‌లు వరుస విషాదాలకు దారి తీస్తున్నాయి. గత గురువారం కిస్త్‌వార్‌లోని చషోటి గ్రామంలో క్లౌడ్ బరస్ట్ చోటుచేసుకుంది. దీంతో 60 మంది చనిపోయారు. శనివారం కథువా జిల్లాలో క్లౌడ్ బరస్ట్ చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు చనిపోయారు. ఇలా జమ్మూకాశ్మీర్‌లో విలయం సృష్టిస్తున్న క్లౌడ్ బరస్ట్‌ అంటే ఏమిటి? ఎందుకు వస్తాయి? ఇప్పుడు తెలుసుకుందాం.

క్లౌడ్ బరస్ట్ అంటే ఏమిటి?

అతి తక్కువ సమయంలో, అతి తక్కువ భౌగోళిక ప్రాంతంలో, అతి ఎక్కువ వర్షపాతం పడటాన్ని 'క్లౌడ్ బరస్ట్' అంటారు. 20 నుంచి 30 చదరపు కిలోమీటర్ల పరిధిలో గంటలకు 10 సెంటీ మీటర్ల వర్షపాతం పడితే దాన్ని క్లౌడ్ బరస్ట్ అంటారు. ఒక్కోసారి ఉరుములు, పిడుగులతో భారీ స్థాయిలో కురిసే వర్షాల కారణంగా వరదలు సైతం వస్తుంటాయి. స్వల్ప పరిధిలో రెండు గంటల వ్యవధిలో 5 సెంటీమీటర్లు లేదా అంతకంటే ఎక్కువ వర్షపాతం పడితే మినీ క్లౌడ్ బరస్ట్ అంటారు. అయితే, తక్కువ సమయంలో కురిసే అన్ని భారీ వర్షాలను క్లౌడ్ బరస్ట్‌లు అనలేము. కొన్ని వాతావరణ పరిస్థితులు ఉంటేనే క్లౌడ్ బరస్ట్ అంటాము.

ఎలా ఏర్పడతాయి?

రుతు పవనాలు దేశంలోకి ప్రవేశించినపుడు అరేబియా సముద్రంలోనుంచి తేమతో కూడిన గాలులు వీస్తాయి. ఇవి అధిక తేమ కలిగిన మేఘాలుగా మారతాయి. వాతావరణంలో వేడి వల్ల ఈ మేఘాలు కరుగుతూ ఉంటాయి. అలా కరిగి, కరిగి మేఘాలు బరువెక్కుతాయి. ఏదో ఒక చోట పేలిపోతాయి. అలా తక్కువ ప్రాంతంలో, తక్కువ సమయంలో భారీ వర్షం పడి వినాశనం జరుగుతుంది. అయితే, క్లౌడ్ బరస్ట్‌లు ఎప్పుడు? ఎక్కడ అవుతాయి అన్నది అంచనా వేయలేము.

ఇండియాలో క్లౌడ్ బరస్ట్ విషాదాలు..

  • 1970లో ఉత్తరాఖండ్‌లోని అలకనందా లోయలో క్లౌడ్ బరస్ట్ కారణంగా భారీ విధ్వంసం జరిగింది. అలకనందా నదికి వరద నీరు పొటెత్తటంతో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది.

  • 1993లో ఉత్తరాఖండ్‌లోని పితోరాఘర్ జిల్లా, మల్ప గ్రామంలో క్లౌడ్ బరస్ట్ కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో కైలాష్ మానస సరోవర్ యాత్రకు వెళుతున్న భక్తులు చాలా మంది చనిపోయారు.

  • 2003 నుంచి 2004 మధ్య కాలంలో ఉత్తరాఖండ్‌లోని కులు, చమలీ ఏరియాలో మినీ క్లౌడ్ బరస్ట్ చోటుచేసుకుంది. దీంతో కొండ ప్రాంతంలో ఆస్తి నష్టం సంభవించింది.

  • 2010లో లడఖ్‌లోని లేహ్‌లో క్లౌడ్ బరస్ట్ కారణంగా పెను విషాదం చోటుచేసుకుంది. దాదాపు 200 మంది చనిపోయారు. వందల మంది గాయపడ్డారు.

  • 2022 జమ్మూకాశ్మీర్‌లో అమర్‌నాథ్ గుహ దగ్గర క్లౌడ్ బరస్ట్ చోటుచేసుకుంది. ఈ ఘటనలో పలువురు చనిపోయారు.

ఇవి కూడా చదవండి

చైనాతో మామూలుగా ఉండదు.. రోబోలతో గేమ్స్ మొదలెట్టింది..

అంతరిక్షంలో మరో అద్భుతం.. బయటపడ్డ ‘ఇంటెస్టెల్లర్ టన్నల్’..

Updated Date - Aug 17 , 2025 | 02:14 PM