Humanoid Robot Games: చైనాతో మామూలుగా ఉండదు.. రోబోలతో గేమ్స్ మొదలెట్టింది..
ABN , Publish Date - Aug 17 , 2025 | 01:25 PM
Humanoid Robot Games: చైనా హ్యూమనాయిడ్ రోబోలకు పోటీలు నిర్వహించటం వెనుక ఓ మాస్టర్ ప్లాన్ ఉంది. రోబిటిక్స్‌లో ప్రపంచ దేశాలకు అందనంత స్థాయికి ఎదగాలని చైనా భావిస్తోంది.
రోబోల వాడకంలో చైనాను కొట్టే వాళ్లే లేరు. రోబోల పరిజ్ఞానం విషయంలో చైనా మిగిలిన ప్రపంచ దేశాల కంటే ముందే ఉంటుంది. ఇక, ఈ విషయంలో చైనా మరో అడుగు ముందుకు వేసింది. తాజాగా, ఓ సరికొత్త రికార్డు సైతం నెలకొల్పింది. హ్యూమనాయిడ్ రోబోలకు ఆటల పోటీలు పెట్టింది. ప్రపంచ వ్యాప్తంగా రోబోలకు ఆటలు పోటీలు పెట్టడం దశాబ్ధాలుగా జరుగుతోంది. అయితే, మనిషి ఆకారంలో ఉండే రోబోలకు ఆటలు పోటీలు పెట్టడం ప్రపంచంలో ఇదే మొదటి సారి.
ఈ ఆటల పోటీలు బీజింగ్‌లో శుక్రవారం జరిగాయి. మొత్తం 500 హ్యూమనాయిడ్ రోబోలు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. 100 మీటర్ల పరుగు పందెం దగ్గరినుంచి కుంగ్ ఫూ వరకు చాలా రకాల పోటీలు జరిగాయి. ఈ పోటీలకు ప్రపంచ వ్యాప్తంగా మంచి స్పందన వచ్చింది. దాదాపు 16 దేశాలకు చెందిన రోబోలు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. గెలుపు కోసం అచ్చం మనుషుల్లానే చాలా కష్టపడ్డాయి. కానీ, మనుషుల్లా వాటికి విచక్షణ ఉండదు కాబట్టి.. వాటి ఇన్‌స్ట్రక్టర్లు దగ్గరుండి గేమ్స్ ఆడించారు. గేమ్స్ సందర్భంగా ఓ రోబో అదుపు తప్పి ఇన్‌స్ట్రక్టర్‌పైకి దూసుకెళ్లింది.
చైనా మాస్టర్ ప్లాన్..
చైనా హ్యూమనాయిడ్ రోబోలకు పోటీలు నిర్వహించటం వెనుక ఓ మాస్టర్ ప్లాన్ ఉంది. రోబిటిక్స్‌లో ప్రపంచ దేశాలకు అందనంత స్థాయికి ఎదగాలని చైనా భావిస్తోంది. ప్రత్యర్థుల పనితనం తెలుసుకోవడానికి ఈ పోటీలు పెట్టింది. ఈ పోటీల ద్వారా ఇతర దేశాల రోబోల పనితీరు ఎలా ఉంది. తమ రోబోలు వాటికంటే ఎక్కడ తక్కువ పనితనం కనబరుస్తున్నాయి. ఇలా అన్ని కోణాల్లో డేటా సిద్ధం చేసుకుంటుంది. అందుకు తగ్గట్టుగా తమ రోబోల్లో మార్పులు చేస్తుంది. రోబోటిక్స్ మార్కెట్‌ను ఏలటమే చైనా అంతిమ లక్ష్యం.
ఇవి కూడా చదవండి
ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన పెను ప్రమాదం.
హిమాచల్‌లో భారీ వర్షాలు.. ఇప్పటివరకు 261 మంది మృతి