Mysterious Interstellar Tunnel: అంతరిక్షంలో మరో అద్భుతం.. బయటపడ్డ ‘ఇంటెస్టెల్లర్ టన్నల్’..
ABN , Publish Date - Aug 17 , 2025 | 12:57 PM
Mysterious Interstellar Tunnel: విశ్వంలోని పరిసరాల్లో చాలా విషయాలు జరుగుతూ ఉన్నాయని ఖగోళ సైంటిస్టులు అంటున్నారు. మ్యాక్స్ ప్లాంక్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన ఖగోళ సైంటిస్టులు విశ్వంపై పరిశోధనలు చేశారు.
అనంత విశ్వం అంతుచిక్కని ఎన్నో విషయాలకు కేరాఫ్ అడ్రస్. శాస్త్రవేత్తలకు సైతం అంతుచిక్కని రహస్యాలు ఈ విశ్వంలో ఎన్నో దాగి ఉన్నాయి. వారు వాటిపై పరిశోధనలు చేసి కొత్త కొత్త విషయాలను కనుగొంటున్నారు. అనంత విశ్వంలో బయటపడుతున్న అద్భుతాలు చూసి వారు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం వింటే మీరు కూడా ఆశ్చర్యపోతారు. మన సోలార్ సిస్టమ్ చుట్టూ శూన్యం ఉందని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అయితే, అది నిజం కాదు.
విశ్వంలోని పరిసరాల్లో చాలా విషయాలు జరుగుతూ ఉన్నాయని ఖగోళ సైంటిస్టులు అంటున్నారు. మ్యాక్స్ ప్లాంక్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన ఖగోళ సైంటిస్టులు విశ్వంపై పరిశోధనలు చేశారు. ఎల్ఎల్ సాలా నాయకత్వంలోని ఖగోళ సైంటిస్టుల బృందం జరిపిన పరిశోధనల్లో ఆశ్చర్యపరిచే విషయాలు వెలుగులోకి వచ్చాయి. సూర్యుడు ఒక పెద్ద వేడి వాయువు బుడగ లోపల కూర్చుని ఉన్నాడని సైంటిస్టులు తేల్చి చెప్పారు.
ఆ వేడి వాయువు బుడగలోపల సోలార్ సిస్టమ్‌ను ఇతర నక్షత్ర వ్యవస్థలతో కలిపే వింతైన ఇంటెర్‌స్టెల్లర్ టన్నల్ ఉండవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. అందరికీ అర్థం అయ్యే భాషలో చెప్పాలంటే.. ఈ విశ్వంలో శూన్యం లేదు. మనం శూన్యంగా ఉందని భావిస్తున్న చోట.. ఇతర ప్రదేశాలను కలిపే ఇంటెర్‌స్టెల్లర్ టన్నెల్‌ల లాంటి ప్లాస్మా నిర్మాణాలు ఉన్నాయి.
మన కంటికి శూన్యంలా కనిపించినా.. అందులో సంక్లిష్టమైన పదార్థాలు, నిర్మాణాలు ఉన్నాయి. సైంటిస్టులు ఈరోసిటా ఎక్స్‌రే టెలిస్కోప్ నుంచి సేకరించిన డేటా ఆధారంగా ఈ పరిశోధన చేశారు. ఈ పరిశోధన తాలూకా వివరాలను ‘ఆస్ట్రానమీ, ఆస్ట్రోఫిజిక్స్ జర్నల్’లో ప్రచురించారు.
ఇవి కూడా చదవండి
ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన పెను ప్రమాదం..