ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Vikram Misri: ప్రభుత్వ నిర్ణయానికి అధికారులను బలి చేయవద్దు

ABN, Publish Date - May 12 , 2025 | 05:18 AM

భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య కాల్పుల విరమణ ప్రకటనపై విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీపై తీవ్రంగా ట్రోలింగ్‌ కొనసాగుతోంది. దీంతో ఆయన తన ‘ఎక్స్‌’ ఖాతాను లాక్‌ చేయగా, ఒవైసీ మిస్రీకు మద్దతుగా స్పందించారు.

ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ

ట్రోలింగ్‌తో ‘ఎక్స్‌’ ఖాతా లాక్‌ చేసిన విక్రమ్‌ మిస్రీ

న్యూఢిల్లీ, హైదరాబాద్‌, మే 11: భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య కాల్పుల విరమణను ప్రకటించినందుకు విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీని లక్ష్యంగా చేసుకొని కొందరు సామాజిక మాధ్యమాల ద్వారా విపరీతంగా ట్రోలింగ్‌ చేయడం ప్రారంభించారు. దీంతో ఆయన తన ‘ఎక్స్‌’ ఖాతాను లాక్‌ చేసినట్లు సమాచారం. కాగా ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ ఈ అంశంపై ‘ఎక్స్‌’ వేదికగా స్పందిస్తూ ప్రభుత్వం లేదా రాజకీయ నాయకత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రకటించినందుకు ఆయన్ను బలి చేయవద్దని కోరారు. మిస్రీ దేశం కోసం నిరంతరం శ్రమించే నిజాయితీపరుడైన దౌత్యవేత్త అని తెలిపారు. కాగా పలువురు బీజేపీ అభిమానులు మిస్రీని లక్ష్యంగా చేసుకుని విపరీతంగా ట్రోలింగ్‌ చేశారు. ఆయన దేశభక్తిని ప్రశ్నించారు. ఆయన కుమార్తెను ఉద్దేశించి కూడా అసభ్య పదజాలం ఉపయోగించారు.


Read Also: Ranveer Allahbadia: ఆపరేషన్ సిందూర్.. అనవసర పోస్టు పెట్టి చిక్కుల్లో పడ్డ రణవీర్ అల్లాహ్‌బాదియా

Operation Sindoor: ఉగ్రవాదుల అంతమే ఆపరేషన్ సింధూర్ లక్ష్యం.. భారత సైన్యం
Operation Sindoor: ఆర్మీ కమాండర్లకు ఫుల్ పవర్

Updated Date - May 12 , 2025 | 05:18 AM