UP Incident: భర్త ఆస్తి కోసం.. ప్రియుడికి మాట ఇచ్చి.. ఏం చేసిందంటే..
ABN, Publish Date - Jun 22 , 2025 | 02:17 PM
ఈ మహిళ తనకంటే వయసులో 20 సంవత్సరాలు పెద్ద వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. భార్యాభర్తలు ఇద్దరూ కొంత కాలం సంతోషంగా ఉన్నారు. అయితే, ఆ తర్వాత విభేదాలు మొదలయ్యాయి. దీంతో ఆ మహిళ వేరొకరితో సంబంధం పెట్టుకుంది. ఇక ఏం చేసిందంటే..
Uttar Pradesh Incident: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. మొరాదాబాద్‌లో భర్తను భార్య అతి దారుణంగా చంపి పొదల్లో పడేసింది. ముందుగా అతడు రోడ్డు ప్రమాదంలో మరణించాడని అందురూ అనుకున్నారు. కానీ, మృతుడి సొదరుడు ఫిర్యాదు చేయడంతో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల ప్రకారం.. అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..
ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త రవీంద్ర కుమార్‌కు తన ఇంటి సమీపంలో ఉన్న రీనా సింధుకు పరిచయం ఏర్పడింది. అప్పటికే రవీంద్రకు భార్య ఆశా, కుమారుడు హర్షిత్ ఉన్నారు. అయితే, 15 సంవత్సరాల క్రితం వ్యాపార నిమిత్తం రవీంద్ర డెహ్రాడూన్‌కు మకాం మార్చాడు. అతని మొదటి భార్య ఆశా.. ఢిల్లీలోని తన కుమారుడు హర్షిత్‌తో కలిసి రాజోకారి గ్రామంలోని అద్దె ఇంట్లో నివసిస్తోంది. అయితే, రీనా సింధు మాత్రం ఢిల్లీని వదిలి తనకంటే 20 సంవత్సరాలు పెద్దవాడైన రవీంద్రతో డెహ్రాడూన్ చేరుకుంది. కొంతకాలానికి రవీంద్ర రీనాను రెండో పెళ్లి చేసుకున్నాడు. రీనాను పెళ్లి చేసుకున్న తర్వాత రవీంద్ర ఢిల్లీలోని తన కుటుంబ సభ్యులను ఎప్పుడూ సంప్రదించలేదు. అతని భార్య ఆశా, కుమారుడు హర్షిత్ కూడా అతన్ని కలవడానికి ప్రయత్నించలేదు. అయితే, పెళ్లి చేసుకున్న రవీంద్ర, రీనా మాత్రం మొరాదాబాద్‌లోని సివిల్ లైన్స్‌లోని రామ్‌గంగా విహార్‌లో ఉంటున్నారు. అక్కడ రెండో భార్య రీనా కోసం రవీంద్ర ఫిజియోథెరపీ సెంటర్ ఏర్పాటు చేశాడు.
ప్రియుడితో పక్కా ప్లాన్..
రవీంద్ర వ్యాపారపనుల్లో బిజీగా ఉంటుండగా రీనా ఫిజియోథెరపీ సెంటర్ నడుపుతుండేది. అయితే, బిజ్నోర్‌లోని నాగినా నివాసి పరితోష్ కుమార్ ఫిజియోథెరపీ కోసం ఆమె కేంద్రానికి వచ్చేవాడు. ఆమె అతనితో ప్రేమలో పడి వివాహేతర సంబంధం కొనసాగిస్తూ ఉండేది. మరోవైపు భర్త రవీంద్ర కుమార్‌కు వ్యాపారంలో తీవ్ర నష్టాలు వచ్చాయి. దీంతో అతడు తన ఆస్తిని అమ్మి అప్పు కట్టాలని అనుకున్నాడు. అయితే, వ్యాపారంలో నష్టాల గురించి భార్య రీనాకు చెప్పాడు. తనకు ఉన్న పెద్ద ఇంటిని అమ్మి అప్పు తీర్చాలని ప్లాన్ చేస్తున్నట్లు చెప్పాడు. కానీ, రీనా అందుకు ఒప్పుకోలేదు. ఈ విషయంపై వారిద్దరూ తరచూ గొడవపడేవారు. ఇక భర్త తీరుపై విసుగు చెందిన భార్య.. రవీంద్ర కుమార్‌ను చంపి, ఇంటిని అమ్మి ప్రియుడు పరితోష్‌తో వెళ్లిపోవాలని పథకం వేసింది. ఇంటిని అమ్మేసి పరితోష్‌కు రూ. 10 లక్షలు ఇస్తానని మాట ఇచ్చింది.
పారతో దాడి చేసి మరీ..
ప్లాన్ ప్రకారం మే 31న తన భర్త రవీంద్ర కుమార్‌ను నాగినాలోని పరితోష్ ఇంటికి పిలిపించి మద్యం తాగించింది. తర్వాత మత్తులో ఉన్న రవీంద్రపై భార్య, ప్రియుడు పరితోష్ పారతో దాడి చేసి ఛాతీ, మెడపై దారుణంగా కొట్టి చంపారు. ఆపై ఇద్దరూ రవీంద్ర మృతదేహాన్ని తమ కారులో ఉంచి రామ్‌నగర్ వైపు తీసుకెళ్లారు. వారికి అక్కడ మృతదేహాన్ని పడేసే అవకాశం దొరకలేదు. ఆ తర్వాత వారు మృతదేహాన్ని కోట్ద్వార్ వైపు తీసుకువెళ్లారు. ఉదయం, దుగ్దారా సమీపంలోని పొదల్లో మృతదేహాన్ని విసిరివేసి ఏమీ తెలియనట్లుగా ఇంటికి వెళ్లారు. అయితే, మృతుడి సోదరుడు తన వదినపై అనుమానం ఉందని ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. భార్య రీనాను, ప్రియుడు పరితోష్‌ను పోలీసులు అరెస్ట్ చేయడంతో వారు జైల్లో ఊచలు లెక్కపెడుతున్నారు.
Also Read:
పహల్గామ్ నిందితులకు ఆశ్రయం కల్పించిన ఇద్దరు అరెస్ట్..
Air India: ప్రయాణికులకు ఎయిర్ ఇండియా ఝలక్
For More National News
Updated Date - Jun 22 , 2025 | 02:35 PM