ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Brahmos Missile: బ్రహ్మోస్‌ భళా..

ABN, Publish Date - May 17 , 2025 | 05:12 AM

ఆపరేషన్ సిందూర్‌లో భారత్ ప్రయోగించిన బ్రహ్మోస్ క్షిపణి పనితీరు అమెరికా రిటైర్డ్ కల్నల్ జాన్ స్పెన్సర్‌ ప్రశంసించారు. పాక్‌‌పై దాడిలో బ్రహ్మోస్ కీలక పాత్ర పోషించి, భారత్‌ సైనిక సామర్థ్యాలను మేల్కొల్పింది అని ఆయన పేర్కొన్నారు.

Brahmos Missile
  • దీనిముందు పాక్‌, చైనా రక్షణవ్యవస్థలు దిగదుడుపే

  • అమెరికా యుద్ధ నిపుణుడు స్పెన్సర్‌

న్యూఢిల్లీ, మే 16: ఆపరేషన్‌ సిందూర్‌లో భాగంగా భారత్‌ ప్రయోగించిన బ్రహ్మోస్‌ క్షిపణి పనితీరును అమెరికాకు చెందిన యుద్ధరంగ నిపుణుడు, రిటైర్డ్‌ కల్నల్‌ జాన్‌ స్పెన్సర్‌ ప్రశంసించారు. పాక్‌తో యుద్ధంలో అటు దాడి చేయడంలోనూ, ఇటు రక్షణాత్మకంగా వ్యవహరించడంలోనూ భారత్‌ స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించిందని కొనియాడారు. దాయాది దేశంలోని ఏ ప్రాంతాన్ని అయినా, ఏ సమయంలో అయినా సునాయాసంగా ఛేదించగలమనే సందేశాన్ని భారత్‌ పంపిందని ‘ఇండియా టుడే’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు. పాక్‌ ఉపయోగించిన చైనా వైమానిక రక్షణ వ్యవస్థలు బ్రహ్మోస్‌ క్షిపణుల ధాటికి నిలబడలేకపోయాయని తెలిపారు.

అసలు వాటికి బ్రహ్మోస్‌తో పోలికే లేదని తేల్చేశారు. పాక్‌లోని ఉగ్ర స్థావరాలు, ఎయిర్‌ బేస్‌లను భారత్‌ సునాయాసంగా ధ్వంసం చేయడంలో బ్రహ్మోస్‌ కీలక పాత్ర పోషించింది. పాకిస్థాన్‌ వ్యాప్తంగా దాడులు చేయడమే కాకుండా శత్రుదేశం చేసిన డ్రోన్‌ దాడులు, క్షిపణులను సమర్థంగా అడ్డుకోవడంలో భారత్‌ విజయవంతమైందని స్పెన్సర్‌ వివరించారు. పాక్‌ ఉపయోగించిన చైనా రక్షణ వ్యవస్థల్లోకి బ్రహ్మోస్‌ చొచ్చుకుపోవడం భారతదేశ అధునాతన సైనిక సామర్థ్యాలకు నిదర్శనమని చెప్పారు. ఆపరేషన్‌ సిందూర్‌ పాక్‌ సైన్యానికి భారీ నష్టాలను మిగిల్చిందని తెలిపారు. భవిష్యత్తులో సైనిక వ్యూహకర్తలు, విద్యార్థులకు ఈ ఆపరేషన్‌ ఒక అధ్యయనాంశంగా మారుతుందని స్పెన్సర్‌ అభిప్రాయపడ్డారు. సింధు జలాలపై భారత్‌ తెలివైన నిర్ణయం తీసుకుందని, ఉగ్ర సంస్థలకు ఇస్తున్న మద్దతుపై పాక్‌ పునరాలోచించుకొనేలా చేసిందని స్పెన్సర్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

Vamsi Remand News: వంశీకి రిమాండ్‌లో మరో రిమాండ్

Minister Lokesh: రెన్యూవబుల్ పరిశ్రమ మాత్రమే కాదు.. ఉద్యమం

Liquor Scam Arrests: ఏపీ లిక్కర్‌ స్కాంలో మరిన్ని అరెస్ట్‌లు.. జోరుగా చర్చ

Amaravati: ప్రమాదకరంగా అమరావతి కరకట్ట రోడ్డు

For More AP News and Telugu News

Updated Date - May 17 , 2025 | 02:06 PM