ఉక్కు, అల్యూమినియంపై సుంకం 25% నుంచి 50శాతానికి!
ABN, Publish Date - Jun 05 , 2025 | 04:30 AM
ఉక్కు, అల్యూమినియంపై దిగుమతి సుంకాలను 25శాతం నుంచి 50శాతానికి పెంచుతూ అమెరికా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సంబంధిత పత్రాలపై మంగళవారం ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ సంతకం చేశారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో నిర్ణయం
మున్ముందు భారత్ ఎగుమతులపై ప్రభావం
పెంపు నుంచి బ్రిటన్‌కు మినహాయింపు
న్యూఢిల్లీ, జూన్ 4: ఉక్కు, అల్యూమినియంపై దిగుమతి సుంకాలను 25శాతం నుంచి 50శాతానికి పెంచుతూ అమెరికా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సంబంధిత పత్రాలపై మంగళవారం ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ సంతకం చేశారు. ఈ ఉక్కు, అల్యూమినియం సుంకాల పెంపు నుంచి బ్రిటన్‌ను ట్రంప్ మినహాయించారు. మిగతా దేశాలకు ఈ నిర్ణయం తక్షణమే వర్తిసుందని అమెరికా ప్రకటించింది.
ఈ సుంకాల పెంపు ప్రభావం భారత ఎగుమతులపై తీవ్రంగా ఉండనుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. భారత్ ఏటా ఐదు బిలియన్ డాలర్ల విలువైన అల్యూమినియం, ఉక్కును.. సంబంధిత వస్తువులను అమెరికాకు ఎగుమతి చేస్తోందని, బ్రిటన్ తరహాలో సుంకాల నుంచి మినహాయింపును భారత్ కోరాలని.. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు జరిగే సమయాల్లో ఈ విషయాన్ని అమెరికా దృష్టికి తేవాలని ఈఈపీసీ చైర్మన్ పంకజ్ చద్దా పేర్కొన్నారు.
Updated Date - Jun 05 , 2025 | 04:30 AM