ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Chirag Paswan: బీహార్‌ ఎన్నికల్లో పోటీ చేస్తా: చిరాగ్

ABN, Publish Date - Jun 08 , 2025 | 09:59 PM

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే భారీ విజయం సాధించేందుకు తమ పార్టీ కృషి చేస్తుందని పాశ్వాన్ తెలిపారు. కేంద్ర రాజకీయాల్లో కొనసాగడంపై మాట్లాడుతూ, ఎక్కువ కాలం కేంద్ర రాజకీయాల్లో కొనసాగుతానని తాను అనుకోవడం లేదన్నారు.

Chirag Paswan

న్యూఢిల్లీ: ఈ ఏడాది చివర్లో జరుగునున్న బీహార్ ఆసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు వస్తున్న ఊహాగానాలకు కేంద్ర మంత్రి, లోక్ జనశక్తి పార్టీ (రామ్‌విలాస్) (LJP-RV) చీఫ్ చిరాగ్ పాశ్వాన్ (Chirag Paswan) తెరదించారు. బీహార్ ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు.

'బీహార్ ఎన్నికల్లో నేను పోటీ చేస్తున్నాను. నేను రామ్‌ విలాస్ పాశ్వాన్ కుమారుడిని. ఆయన కలలను సాకారం చేసేందుకు పాటుపడతాను. బీహార్, బీహార్ ప్రజల అభివృద్ధికే నా తొలి ప్రాధాన్యం' అని చిరాగ్ పాశ్వాన్ తెలిపారు. ఎక్కడ్నించి పోటీ చేయాలనేది ప్రజలే నిర్ణయిస్తారని, ఏ రాజకీయ నిర్ణయం తీసుకున్నా అది రాష్ట్రం, రాష్ట్ర ప్రజలను దృష్టిపెట్టుకునే తీసుకుంటానని చెప్పారు.

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే భారీ విజయం సాధించేందుకు తమ పార్టీ కృషి చేస్తుందని పాశ్వాన్ తెలిపారు. కేంద్ర రాజకీయాల్లో కొనసాగడంపై మాట్లాడుతూ, ఎక్కువ కాలం కేంద్ర రాజకీయాల్లో కొనసాగుతానని తాను అనుకోవడం లేదని, తాను రాజకీయాల్లోకి వచ్చిందే బీహార్ కోసం, బీహార్ ప్రజల కోసమని స్పష్టం చేశారు. బీహార్ ఫస్ట్, బిహారీ ఫస్ట్ అనే విజన్‌ను ముందుకు తీసుకువెళ్లాలని అనుకుంటున్నట్టు చెప్పారు.

ఇవి కూడా చదవండి..

హిందీపై కమల్ హాసన్ హాట్ కామెంట్స్

లిఖితపూర్వకంగా కోరితే స్పందిస్తాం.. రాహుల్‌‌ వ్యాఖ్యలపై ఈసీ

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 08 , 2025 | 10:01 PM