ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ULFA: సరిహద్దుల్లో ఉల్ఫా ఆపరేషనల్ కమాండర్ అరెస్టు

ABN, Publish Date - May 24 , 2025 | 06:01 PM

సోమ్ జాడకోసం గత ఐదు నెలలుగా నిఘా ఉంచామని, తీన్‌సుకుయా జిల్లా మార్గెరిటా ఏరియాలో అతని కదలికలు ఉన్నట్టు నిర్దిష్ట ఇంటెలిజెన్స్ సమాచారం రావడంతో మధ్యాహ్నం 4 గంటలకు సంయుక్త ఆపరేషన్ జరిపి పట్టుకున్నట్టు ఎస్పీ అభిజిత్ గౌరవ్ చెప్పారు. అతని నుంచి పలు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు

గౌహతి: మిలిటెంట్ సంస్థ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం (ఇండిపెండెంట్) (ULFA-I) ఆపరేషనల్ కమాండర్ రూపమ్ అసోమ్ (Rupam Asom) పట్టుబడ్డాడు. అసోం పోలీసులు, అసోం రైఫిల్స్, మిలటరీ ఇంటెలిజెన్స్ సంయుక్తంగా జరిపిన గాలింపు చర్యల్లో ఈ అరెస్టు జరిగింది. అసోం-అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లోని అటవీ ప్రాంతం సమీపంలో రూపమ్ అసోమ్ పట్టుబడినట్టు తీన్‌సుకియా సూపరింటెడెంట్ ఆఫ్ పోలీస్ అభిజిత్ గౌరవ్ ధ్రువీకరించారు. రూపమ్ అసోమ్ పట్టుబడటంతో ఈ ప్రాంతాంలో మిలిటెంట్ కార్యకలాపాలకు గట్టి దెబ్బ తగినట్టు చెబుతున్నారు.

Aircraft Window Shades: పాక్ సరిహద్దుల్లో విండోషేడ్స్ మూసి ఉంచాలి.. కీలక ఆదేశాలు


అసోమ్ జాడకోసం గత ఐదు నెలలుగా నిఘా ఉంచామని, తీన్‌సుకుయా జిల్లా మార్గెరిటా ఏరియాలో అతని కదలికలు ఉన్నట్టు నిర్దిష్ట ఇంటెలిజెన్స్ సమాచారం రావడంతో శనివారం మధ్యాహ్నం 4 గంటలకు సంయుక్త ఆపరేషన్ జరిపి పట్టుకున్నట్టు అభిజిత్ గౌరవ్ చెప్పారు. అతని నుంచి పలు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.


అసోంలోని పలు ప్రాంతాల్లో బలవంతపు వసూళ్ల రాకెట్ నడుపుతున్న రూపమ్ ఆసోమ్‌ కదలికలపై కొద్ది నెలలుగా పోలీసు బృందాలు నిఘా ఉంచాయి. 2018లో బోర్డుమ్సా పోలీస్ స్టేషన్‌ ఇన్‌చార్జి భాస్కర్ కలిత హత్య కేసుతో సహా పలు నేరసబంధిత కార్యకలాపాల్లో ఆయన ప్రమేయం ఉంది. కలిత హత్య కేసుపై ఎన్ఐఏ ఛార్జిషీటులోనూ రూపమ్ అసోమ్ పేరు ఉంది. కాగా, రూపమ్ అసోమ్ పట్టుబడటంతో ఆ ప్రాంతంలో క్రిమినల్ కార్యకలాపాలకు పాల్పడుతున్న ఉల్ఫా(ఐ)కి చెందిన మరికొందరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

Covid 19 Cases in India: ఢిల్లీ, ముంబైలో కోవిడ్ కేసులు.. ఆసుపత్రుల్లో హైఅలర్ట్

Rains: రెండు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌.. రేపు, ఎల్లుండి పొంచివున్న ముప్పు

Karnataka: జైలు నుంచి విడుదలయ్యాక ఊరేగింపు.. కర్ణాటక అత్యాచార నిందితుల అరెస్టు

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 24 , 2025 | 06:02 PM