ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Donald Trump Mediation: మధ్యవర్తిత్వం చేస్తా

ABN, Publish Date - May 12 , 2025 | 04:50 AM

ట్రంప్‌ కశ్మీర్‌ వివాదంలో మధ్యవర్తిత్వం చేయడానికి ఆఫర్‌ చేసినప్పటికీ, భారత్‌ ఆ ఆఫర్‌ను తిరస్కరించింది. పీవోకేను తిరిగి పొందడమే భారత్‌ లక్ష్యమని, ఈ విషయంలో మధ్యవర్తిత్వం అవసరం లేదని స్పష్టం చేసింది.

కశ్మీర్‌పై ట్రంప్‌ అత్యుత్సాహం

ఆఫర్‌ను తోసిపుచ్చిన భారత్‌.. పీవోకేను అప్పగించడంపైనే మాట్లాడతామని స్పష్టీకరణ

ట్రంప్‌ ఆఫర్‌ను స్వాగతించిన పాక్‌

న్యూఢిల్లీ, మే11: ఉక్రెయిన్‌-రష్యా మధ్య యుద్ధాన్ని ఆపలేకపోయారు.. ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య శాంతిని నెలకొల్పడంలోనూ విఫలమయ్యారు.. కానీ భారత్‌-పాక్‌ మధ్య పెద్దన్న పాత్ర పోషించి కశ్మీర్‌ సమస్యను పరిష్కరించడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సిద్ధమైపోయారు. అయితే ట్రంప్‌ ఆఫర్‌ను భారత్‌ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ మాత్రం ట్రంప్‌ మధ్యవర్తిత్వాన్ని స్వాగతించడంతోపాటు ఈ విషయంలో చొరవ చూపుతున్నందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. భారత్‌, పాక్‌ మధ్య కాల్పుల విరమణలో అమెరికా పాత్ర ఉందని ప్రకటించుకున్న ట్రంప్‌.. కశ్మీర్‌ అంశంపైనా అత్యుత్సాహం ప్రదర్శించారు. ఈ సమస్య పరిష్కారం కోసం మధ్యవర్తిత్వానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఈ విషయమె భారత్‌, పాక్‌తో కలిసి పని చేస్తామని తన ట్రూత్‌ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంలో శనివారం పోస్టు చేశారు. ‘ప్రస్తుత సంఘర్షణలతో మరణాలు, విధ్వంసం తప్ప ఏ ప్రయోజనం ఉండదని భారత్‌, పాక్‌లోని బలమైన, శక్తిమంతమైన నాయకత్వాలు అర్థం చేసుకున్నందుకు గర్వం గా ఉంది. కాల్పుల విరమణపై నిర్ణయం తీసుకోవడంలో అమెరికా మీకు సాయం చేయగలిగినందుకు గర్విస్తున్నాను. కశ్మీర్‌ సమస్యకు పరిష్కారాన్ని కనుక్కోవడంలో మీతో కలిసి పనిచేస్తా’ అని ఆ పోస్టులో ట్రంప్‌ పేర్కొన్నారు.


కాగా, రెండు దేశాల మధ్య శాంతిని నెలకొల్పడానికి అమెరికా చేస్తున్న ప్రయత్నాలను పాక్‌ ప్రధాని ప్రశంసించారు. అయితే కాల్పుల విరమణకు పాక్‌ డీజీఎంవో ప్రతిపాదన చేశారని, ఇందులో మరొకరి పాత్రలేదని భారత్‌ పేర్కొంది. కశ్మీర్‌ విషయంలో ఎవరి మధ్యవర్తిత్వం అవసరంలేదని స్పష్టంచేసింది. ‘కశ్మీర్‌ విషయంలో మాకు స్పష్టమైన వైఖరి ఉంది. పీవోకేను తిరిగి అప్పగించడం ఒక్కటే మిగిలి ఉంది. ఈ విషయంలో ఇంతకుమించి మాట్లాడటానికి ఏంలేదు. ఉగ్రవాదుల అప్పగింతపై వాళ్లు మాట్లాడితే... మేం మాట్లాడతాం. మరో విషయంపై మాట్లాడే ఉద్దేశం లేదు. ఇందులో ఎవరి మధ్యవర్తిత్వం కోరుకోవడంలేదు. ఆ అవసరమూ లేదు’అని ప్రభుత్వవర్గాలు పేర్కొన్నాయి.


Read Also: Ranveer Allahbadia: ఆపరేషన్ సిందూర్.. అనవసర పోస్టు పెట్టి చిక్కుల్లో పడ్డ రణవీర్ అల్లాహ్‌బాదియా

Operation Sindoor: ఉగ్రవాదుల అంతమే ఆపరేషన్ సింధూర్ లక్ష్యం.. భారత సైన్యం
Operation Sindoor: ఆర్మీ కమాండర్లకు ఫుల్ పవర్

Updated Date - May 12 , 2025 | 04:50 AM