Ooty Hill Train: ఊటీ కొండ రైలులో ప్రయాణానికి పర్యాటకుల ఆసక్తి
ABN, Publish Date - Jul 22 , 2025 | 01:06 PM
ఊటీ కొండ రైలులో ప్రయాణించేందుకు సోమవారం పెద్దసంఖ్యలో ప్రయాణికులు వేచి ఉన్నారు. ప్రముఖ పర్యాటక ప్రాంతం నీలగిరి జిల్లాకు వచ్చే పర్యాటకులు ఊటీ కొండ రైలులో ప్రయాణించేందుకు ఆసక్తి చూపుతుంటారు. ప్రయాణికుల సౌకర్యార్ధం కున్నూర్-ఊటీ మధ్య ప్రతిరోజు తలా నాలుగుసార్లు, మేట్టుపాళయం-ఊటీ మధ్య తలా ఒకసారి కొండ రైలు సేవలు అందుబాటులో ఉన్నాయి.
- కున్నూర్ రైల్వేస్టేషన్‌లో పర్యాటకులు
చెన్నై: ఊటీ కొండ రైలు(Ooty Hill Train)లో ప్రయాణించేందుకు సోమవారం పెద్దసంఖ్యలో ప్రయాణికులు వేచి ఉన్నారు. ప్రముఖ పర్యాటక ప్రాంతం నీలగిరి జిల్లాకు వచ్చే పర్యాటకులు ఊటీ కొండ రైలులో ప్రయాణించేందుకు ఆసక్తి చూపుతుంటారు. ప్రయాణికుల సౌకర్యార్ధం కున్నూర్-ఊటీ మధ్య ప్రతిరోజు తలా నాలుగుసార్లు, మేట్టుపాళయం-ఊటీ(Metturupalayam-Ooty) మధ్య తలా ఒకసారి కొండ రైలు సేవలు అందుబాటులో ఉన్నాయి.
ప్రస్తుతం, వారాంతపు సెలవు రోజులు పురస్కరించుకుని శుక్రవారం నుంచి సోమవారం వరకు ప్రత్యేక రైలు సేవలు ఉంటాయని రైల్వే అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం జిల్లాకు భారీ వర్ష సూచన ప్రకటించడంతో అటవీ శాఖ ఆధీనంలోని పలు పర్యాటక ప్రాంతాలు మూసివేసినా, కొండ రైలులో ప్రయాణించేందుకు మాత్రం పర్యాటకులు ఆసక్తి చూపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మళ్లీ పెరిగిన గోల్డ్ ధరలు.. కానీ వెండి రేట్లు మాత్రం..
Read Latest Telangana News and National News
Updated Date - Jul 22 , 2025 | 01:08 PM