Pahalgam Terror Attack: పాక్‌పై కేంద్రం కీలక నిర్ణయం.. ఎంపీ సంచలన వ్యాఖ్యలు
ABN, Publish Date - Apr 24 , 2025 | 08:02 AM
Pahalgam Terror Attack: పహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌పై బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే ఈ దాడి నేపథ్యంలో మోదీ ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలను ఆయన స్వాగతించారు. అలాగే ప్రధాని మోదీపై ప్రశంసల జల్లు కురిపించారు.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో 28 మంది మృతి చెందారు. ఈ నేపథ్యంలో మోదీ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నిర్ణయాలను బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే తన ఎక్స్ ఖాతా వేదికగా స్వాగతించారు. 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసినందుకు ప్రధాని నరేంద్ర మోదీపై ఆయన ప్రశంసల జల్లు కురిపించారు. ఇది మోదీ నాయకత్వం యొక్క ధైర్యంతోపాటు దృఢమైన నిర్ణయాత్మకమైన వైఖరికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. పాకిస్థానీయులు నీరు లేకుంటే చనిపోతారన్నారు. తాము బీజేపీ కార్యకర్తలమని వారిని హింసించిన అనంతరం చంపేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా 1960లో నోబెల్ బహుమతి పొందేందుకు ఈ ఒప్పందం కోసం నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు వ్యవహరించిన తీరును తన ఎక్స్ ఖాతా వేదికగా ఎంపి నిషికాంత్ దుబే ఎండగట్టారు.
1960,సెప్టెంబర్ 19వ తేదీన భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు, పాకిస్థాన్ అధ్యక్షుడు అయుబ్ ఖాన్ మధ్య సింధు జలాలపై ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే.
ఏప్రిల్ 22వ తేదీన అనంత్ నాగ్ జిల్లాలోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో మొత్తం ఇద్దరు విదేశీ పర్యాటకులతో కలిపి 28 మంది మరణించారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ దాదాపు మూడు గంటల పాటు సమావేశమైంది. ఈ సమావేశంలో భాగంగా భారత్ పలు కీలక నిర్ణయాలు తీసుకొంది. సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం అట్టారి-వాఘా చెక్ పోస్ట్‌ను మూసి వేయవడం, సార్క్ వీసా మినహాయింపు పథకంలో భాగంగా పాక్ జాతీయులు భారత్‌లోకి ప్రవేశించడం తదితర కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే పైవిధంగా స్పందించారు.
For National news And Telugu News
Updated Date - Apr 24 , 2025 | 08:03 AM