ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Terrorists Hideout: తప్పిన పెను ప్రమాదం.. ఉగ్ర స్థావరంలో భారీగా బయటపడ్డ ఐఈడీలు

ABN, Publish Date - May 05 , 2025 | 11:33 AM

Jammu and kashmir: ఆదివారం రాత్రి జరిపిన సెర్చ్ ఆపరేషన్‌లో ఉగ్రస్థావరం బయటపడింది. భద్రతా దళాలు సరైన టైంలో ఆ స్థావరాన్ని గుర్తించకపోతే.. మరో ఉగ్రదాడి జరిగి ఉండేది. 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత జరిగిన అతి పెద్ద ఉగ్రదాడి పహల్గామ్ ఉగ్రదాడి కావటం గమనార్హం.

Jammu and kashmir

జమ్మూకాశ్మీర్లోని పూంచ్‌లో ఉగ్రవాదుల స్థావరం బయటపడింది. ఆ ఉగ్రవాదుల స్థావరంలో భారీగా ఇంప్రవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజెస్ (ఐఈడీ)లతో పాటు మరికొన్ని వస్తువులు కూడా దొరికాయి. ఇండియన్ ఆర్మీ, జమ్మూకాశ్మీర్ పోలీస్, స్పెషల్ ఆపరేషన్ గ్రూపు సంయుక్తంగా పూంచ్ జిల్లాలోని మరోటే గ్రామంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఆదివారం రాత్రి జరిపిన ఈ సెర్చ్ ఆపరేషన్‌లో ఉగ్రస్థావరం బయటపడింది. ఐదు ఐఈడీలను, వైర్‌లెస్ సెట్లు, ఉగ్రవాదుల బట్టల్ని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి.


పహల్గామ్ ఉగ్రదాడి తర్వాతి నుంచి భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్లను ముమ్మరం చేశాయి. దాడికి పాల్పడ్డ ఉగ్రవాదుల కోసం అన్వేషిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పలు ఉగ్రవాదుల స్థావరాలు బయటపడుతున్నాయి. తాజాగా, పూంచ్‌లో బయటపడ్డ ఉగ్ర స్థావరం కారణంగా.. పెను ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. భద్రతా దళాలు సరైన టైంలో ఆ స్థావరాన్ని గుర్తించకపోతే.. మరో ఉగ్రదాడి జరిగి ఉండేది. 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత జరిగిన అతి పెద్ద ఉగ్రదాడి పహల్గామ్ ఉగ్రదాడి కావటం గమనార్హం.


జైళ్లు టార్గెట్‌గా ఉగ్రదాడులు

జమ్మూకాశ్మీర్‌లో జైళ్లు టార్గెట్‌గా ఉగ్రదాడులు జరిగే అవకాశం కనిపిస్తోంది. హైప్రొఫైల్ టెర్రిస్టులతో పాటు గ్రౌండ్ వర్కర్లు ఉన్న జైళ్లపై ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉన్నట్లు నిఘా వర్గాలు సోమవారం హెచ్చరికలు జారీ చేశాయి. పహల్గామ్ ఉగ్రదాడి కేసుకు సంబంధించి నేషనల్ ఇన్వెష్టిగేషన్ ఏజెన్సీ.. ఇండియన్ ఆర్మీ వెహికల్స్‌పై దాడికి పాల్పడ్డ కేసులో అరెస్టైన నిసార్, ముస్తక్‌లను విచారించింది. ఈ నేపథ్యంలోనే జైళ్లపై దాడి విషయాలు బయటపడ్డాయి. నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో సీఐఎస్‌ఎఫ్‌ హై అలర్ట్ ప్రకటించింది.


ఇవి కూడా చదవండి

Jammu and kashmir: మరో కుట్రకు తెరలేపిన ఉగ్రవాదులు.. ఈ సారి జైళ్లు టార్గెట్‌గా..

Pakistan Army: కాల్పుల విరమణకు తూట్లు.. 11వ రోజు కూడా అదే దుర్మార్గం..

Updated Date - May 05 , 2025 | 01:32 PM