Share News

Pakistan Army: కాల్పుల విరమణకు తూట్లు.. 11వ రోజు కూడా అదే దుర్మార్గం..

ABN , Publish Date - May 05 , 2025 | 09:43 AM

Pakistan Army: ఇండియన్ ఆర్మీ పాక్ ఆర్మీకి తగిన విధంగా సమాధానం చెబుతూనే ఉంది. సరిహద్దుల వెంబడి తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ప్రజల రక్షణకు చర్యలు తీసుకుంటోంది. సరిహద్దులోని పోస్టులను టార్గెట్‌గా చేసుకుని పాక్ కాల్పులకు తెగబడుతోంది.

Pakistan Army: కాల్పుల విరమణకు తూట్లు.. 11వ రోజు కూడా అదే దుర్మార్గం..
Pakistan Army

రోడ్డు మీద పడుకునే దున్నపోతు.. పాకిస్తాన్ పరిస్థితి ఒకేలా తయారైంది. మంచి మాటలతో ఎంత చెప్పినా పాక్ వినటం లేదు. భారత్ సంయమనం పాటించే కొద్ది పాక్ రెచ్చిపోతూనే ఉంది. భారత్ మంచి తనాన్ని చేతకానితనంగా భావిస్తోంది. ప్రతీ నిత్యం కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూనే ఉంది. లైన్ ఆఫ్ కంట్రోల్ (ఎల్ఓసీ) పొడవునా కాల్పులకు పాల్పడుతూనే ఉంది. 11వ రోజు కూడా ఎల్ఓసీ పొడవునా పాక్ సైన్యం కాల్పులకు పాల్పడింది. కుప్వారా, బారాముళ్ల, పూంచ్, రజౌరీ, మెందర్, నౌషేరా, సుందరబనీ, అంకూర్ల సరిహద్దు ప్రాంతాల్లో కాల్పులు జరిపింది.


పహల్గామ్ ఉగ్రదాడి జరిగినప్పటినుంచి ఇప్పటి వరకు కూడా సరిహద్దు ప్రాంతాల్లో కాల్పులకు తెగబడుతోంది. ఈ కాల్పుల్లో ఇప్పటి వరకు 26 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇండియన్ ఆర్మీ పాక్ ఆర్మీకి తగిన విధంగా సమాధానం చెబుతూనే ఉంది. సరిహద్దుల వెంబడి తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ప్రజల రక్షణకు చర్యలు తీసుకుంటోంది. సరిహద్దులోని పోస్టులను టార్గెట్‌గా చేసుకుని పాక్ కాల్పులకు తెగబడుతోంది. 8 సెక్టార్లలోని 35 పోస్టులపై ఆదివారం రాత్రి కాల్పులు మొదలెట్టింది. సోమవారం ఉదయం వరకు ఆ కాల్పులు కొనసాగాయి.


యుద్ద భయంలో పాక్

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ తీసుకుంటున్న నిర్ణయాలతో పాక్ అల్లాడిపోతోంది. భారత్ యుద్దం ప్రకటించనుందన్న ప్రచారం జరుగుతన్న నేపథ్యంలో.. పాక్ భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటోంది. ఈ నేపథ్యంలోనే సరిహద్దు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భద్రతా దళాలను తెచ్చిపెట్టుకుంది. కీలకమైన ఆరు రీజన్లలో ఆర్మీ ట్రూపులను సిద్ధంచేసి పెట్టుకుంది. కోట్లీ, మీర్పూర్, మంగ్ల ఫార్వర్డ్, ఖురెట్టా, రావలకోట్, భట్టల్, హజీరా, ముజఫర్‌బాద్, ఆలియాబాద్, చకోతి, అబ్బోట్టాబాద్, భాగ్, బాలాకోట వద్ద ఆర్మీ పెద్ద ఎత్తున గస్తీ కాస్తోంది. మరోసారి కాల్పులకు పాల్పడే ప్రయత్నం చేస్తోంది.


ఇవి కూడా చదవండి

Minister Sanjay Sharma: ఇదేం పని మంత్రి గారూ.. సమస్య తిర్చమంటే ఫోన్ లాక్కుంటారా..

Fighting Over Tandoori Roti: మరీ ఇంత దారుణమా.. తందూరీ రోటీ కోసం కొట్టికుని చచ్చారు

Updated Date - May 05 , 2025 | 09:51 AM