Share News

Jammu and kashmir: మరో కుట్రకు తెరలేపిన ఉగ్రవాదులు.. ఈ సారి జైళ్లు టార్గెట్‌గా..

ABN , Publish Date - May 05 , 2025 | 10:43 AM

Jails In Jammu and kashmir: ప్రస్తుతం జమ్మూకాశ్మీర్‌లోని జైళ్ల సెక్యూరిటీ బాధ్యత సీఐఎస్‌ఎఫ్ నిర్వహిస్తోంది. అంతకు క్రితం ఆ బాధ్యతలు సీఆర్పీఎఫ్ నిర్వహించేది. 2023లో జైళ్ల నిర్వహణ బాధ్యత సీఆర్ఫీఎఫ్ నుంచి సీఐఎస్‌ఎఫ్‌కు బదిలీ అయింది.

Jammu and kashmir: మరో కుట్రకు తెరలేపిన ఉగ్రవాదులు.. ఈ సారి జైళ్లు టార్గెట్‌గా..
Jammu and kashmir

జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు పెచ్చు మీరి విలయతాండవం చేస్తున్నారు. కొంతమంది స్థానికుల అండతో రోజుకో కుట్రకు తెరతీస్తున్నారు. నిఘా వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సారి ఉగ్రవాదులు జైళ్లను టార్గెట్‌గా చేసుకున్నట్లు తెలుస్తోంది. అది కూడా జమ్మూకాశ్మీర్‌లోని జైళ్లను టార్గెట్ చేసి ఉగ్రదాడికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. హైప్రొఫైల్ టెర్రిస్టులతో పాటు గ్రౌండ్ వర్కర్లు ఉన్న జైళ్లపై ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు నిఘా వర్గాలు సోమవారం హెచ్చరికలు సైతం జారీ చేశాయి.


ఉగ్రదాడి జరిగే అవకాశం ఉన్న జైళ్లలో.. శ్రీనగర్ సెంట్రల్ జైలు, కోట్ భవ్‌లాల్ జైల్, జమ్మూ జైలు కూడా ఉన్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి కేసుకు సంబంధించి నేషనల్ ఇన్వెష్టిగేషన్ ఏజెన్సీ.. ఇండియన్ ఆర్మీ వెహికల్స్‌పై దాడికి పాల్పడ్డ కేసులో అరెస్టైన నిసార్, ముస్తక్‌లను విచారించింది. ఆ ఇద్దరూ కోట్ భవ్‌లాల్ జైలులో ఉన్నారు. వారిని విచారించిన నేపథ్యంలోనే జైళ్లపై దాడి విషయాలు బయటపడ్డాయి. ప్రస్తుతం జమ్మూకాశ్మీర్‌లోని జైళ్ల సెక్యూరిటీ బాధ్యత సీఐఎస్‌ఎఫ్ నిర్వహిస్తోంది. అంతకు క్రితం ఆ బాధ్యతలు సీఆర్పీఎఫ్ నిర్వహించేది. 2023లో జైళ్ల నిర్వహణ బాధ్యత సీఆర్ఫీఎఫ్ నుంచి సీఐఎస్‌ఎఫ్‌కు బదిలీ అయింది. ఉగ్రదాడి నేపథ్యంలో సీఐఎస్‌ఎఫ్ హై అలర్ట్ ప్రకటించింది.


11వ రోజుకూడా ఆగని పాక్ దుశ్చర్యలు

గత కొద్దిరోజులనుంచి పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూనే ఉంది. లైన్ ఆఫ్ కంట్రోల్ (ఎల్ఓసీ) పొడవునా పాక్ ఆర్మీ కాల్పులకు తెగబడుతోంది. పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన నాటినుంచి ఇప్పటి వరకు కాల్పులు జరుపూనే ఉంది. ఆదివారం రాత్రి 11వ రోజు 8 సెక్టార్లలోని 35 పోస్టులపై ఆదివారం రాత్రి కాల్పులు మొదలెట్టింది. సోమవారం ఉదయం వరకు ఆ కాల్పులు కొనసాగాయి. పాకిస్తాన్ దుశ్చర్య కారణంగా ఇప్పటి వరకు 26 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. కోట్లీ, మీర్పూర్, మంగ్ల ఫార్వర్డ్, ఖురెట్టా, రావలకోట్, భట్టల్, హజీరా, ముజఫర్‌బాద్, ఆలియాబాద్, చకోతి, అబ్బోట్టాబాద్, భాగ్, బాలాకోట వద్ద పాక్ ఆర్మీ మరోసారి కాల్పులకు తెగబడే అవకాశం కనిపిస్తోంది.


ఇవి కూడా చదవండి

Pakistan Army: కాల్పుల విరమణకు తూట్లు.. 11వ రోజు కూడా అదే దుర్మార్గం..

Ultraprocessed Foods: ప్యాకెట్ ఫుడ్ తింటున్నారా.. అయితే మీ ప్రాణాలు రిస్క్‌లో పడ్డట్టే..

Updated Date - May 05 , 2025 | 10:53 AM