Tata Group Trust: ఏఐ విమాన ప్రమాదం మృతుల కోసం రూ.500 కోట్లతో టాటా ట్రస్ట్
ABN, Publish Date - Jul 18 , 2025 | 07:49 PM
అహ్మదాబాద్‌లో ఇటీవల జరిగిన ఎయిర్ ఇండియా ప్రమాద మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు టాటా ట్రస్ట్, సన్స్ ముందుకొచ్చాయి. ఈ మేరకు ముంబై వేదికగా ఓ ట్రస్ట్ ను ఏర్పాటు చేశాయి.
న్యూఢిల్లీ: టాటా సన్స్ అండ్ టాటా ట్రస్ట్స్ (Tata Sons and Tata Trusts) శుక్రవారం నాడు కీలక నిర్ణయం తీసుకుంది. అహ్మదాబాద్‌లో ఇటీవల జరిగిన ఎయిర్ ఇండియా ప్రమాద మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు రూ.500కోట్లతో సంక్షేమ ట్రస్టు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. ఇందుకు సంబంధించి 'ది ఏఐ-171 మెమోరియల్ అండ్ వెల్ఫేర్ ట్రస్ట్' (The AI-171 Memorial and Welfare Trust)ను ముంబైలో రిజిస్టర్ చేసింది. ఇందు కోసం టాటా సన్స్, టాటా ట్రస్ట్ చెరో రూ.250కోట్లు ట్రస్టుకు జమ చేయనున్నాయి. విమాన ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున ఈ ట్రస్టు అందజేస్తుంది.
మానవ సంక్షేమాన్ని ప్రోత్సహించేందుకు (ఫిలాంత్రోపిక్ పర్పసెస్) ఏర్పాటు చేస్తున్న ఈ ట్రస్టు ద్వారా విమాన ప్రమాదంలో గాయపడిన వారికి వైద్య సహాయం అందించడం, ఘటనలో దెబ్బతిన్న బీజే మెడికల్ కాలేజీ ఇన్‌ఫ్రాస్టక్చర్ పునర్నిర్మాణానికి పూర్తి సహకారం అందిస్తారు.
జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలింది. ఈ ఘటనలో విమానంలోని 241 మందితోపాటు.. విమానం కుప్పకూలిన మెడికల్ కాలేజీ ప్రాంతంలోని 19 మంది మృతిచెందారు. విమాన ప్రమాదంపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది.
ఇవి కూడా చదవండి..
చంగూర్ బాబా రెడ్ డైరీలో పలువురు పొలిటీషియన్ల పేర్లు
భూమికి ఉద్యోగం కేసు.. లాలూకు చుక్కెదురు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jul 18 , 2025 | 08:16 PM