Tamilnadu Train Incident: ఘోర ప్రమాదం.. స్కూల్ వ్యాన్‌ను ఢీకొట్టిన రైలు.. అక్కడికక్కడే..
ABN, Publish Date - Jul 08 , 2025 | 09:04 AM
తమిళనాడులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కడలూరు జిల్లా చెమ్మంగుప్పంలో ప్రైవేట్ స్కూల్ వ్యాన్‌ను రైలు ఢీకొట్టింది.
Tamilnadu Train Incident: తమిళనాడులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కడలూరు జిల్లా చెమ్మంగుప్పంలో ప్రైవేట్ స్కూల్ వ్యాన్‌ను రైలు ఢీకొట్టింది. రైలు వెళ్లే సమయానికి గేటు వేయకపోవడంతో ఈ ఘోరం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రాథమిక నివేదికల ప్రకారం 10 మందికి పైగా విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో స్కూల్ వ్యాన్ నుజ్జునుజ్జు అయినట్లు కనిపిస్తోంది.
వెంటనే అప్రమత్తమైన స్థానికులు ఘటనపై అధికారులకు సమాచారం అందించారు. హుటాహుటినా రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి సహాయక చర్యలు చేపట్టారు. కాగా, ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. రైల్వే గేట్ కీపర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు.
Updated Date - Jul 08 , 2025 | 09:39 AM