ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Stalin: రాష్ట్రంలో మత ఉగ్రవాదాన్ని సహించబోం..

ABN, Publish Date - Apr 29 , 2025 | 12:24 PM

ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ స్పష్టం చేశారు. అలాగే.. రాష్ట్రంలో మత ఉగ్రవాదాన్ని సహించబోమని కూడా పేర్కొన్నారు. శాసనసభలో సీఎం మాట్లాడారు.

- అసెంబ్లీలో సీఎం స్టాలిన్‌

చెన్నై: రాష్ట్రంలో మత ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, ఉగ్రవాదం ఏ రూపంలో వున్నా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) స్పష్టం చేశారు. శాసనసభలో సోమవారం ఉదయం హోంశాఖ నిర్వర్తిస్తున్న స్టాలిన్‌ పోలీసు, అగ్నిమాపక శాఖకు సంబంధించిన ప్రతిపాదనలు చేసి ప్రసంగించారు. రాష్ట్రంలో మహిళల భద్రతకు భరోసా లేదని, మతపరమైన ఘర్షణలు అధికం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే వానతి శ్రీనివాసన్‌(BJP MLA Vasati Srinivasan) డిమాండ్‌ చేశారు.

ఈ వార్తను కూడా చదవండి: Chennai: ‘కరుణానిధి’ పేరుతో కొత్త విశ్వవిద్యాలయం


న్యాయశాఖ మంత్రి రఘుపతి, సీనియర్‌ మంత్రి దురైమురుగన్‌ జోక్యం చేసుకుని దేశంలోనే మహిళలకు పటిష్టమైన భద్రత కలిగిన రాష్ట్రం తమిళనాడేనని, ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే నేరాల సంఖ్య కూడా తక్కువేనని తెలిపారు. ముఖ్యమంత్రి స్టాలిన్‌ జోక్యం చేసుకుని వానతి శ్రీనివాసన్‌ ఆడిటర్‌ రమేష్‌ హత్య విషయాన్ని ప్రస్తావించారని, ఆ సంఘటన అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో జరిగిందని, ఆ హత్యకేసుపై ఇంకా విచారణ కొనసాగుతోందని చెప్పారు.


ఇక కశ్మీర్‌లోయలో జరిగిన ఉగ్రవాద కార్యకలాపాలు రాష్ట్రంలో జరగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని వానతి శ్రీనివాసన్‌ కోరటం వింతగా ఉందన్నారు. రాష్ట్రంలో మత ఉగ్రవాదం అడుగుపెట్టనివ్వకుండా కఠిన చర్యలు తీసుకునేందుకు తమ ప్రభుత్వం ఏ మాత్రం వెనుకాడదన్నారు. కశ్మీర్‌ లోయలో జరిగిన మారణకాండపై పార్లమెంట్‌లో చర్చలు జరుపుతున్నప్పుడు కేంద్ర ప్రభుత్వ భద్రతా లోపమని డీఎంకే ఎంపీలు ఎవరూ ఆరోపించలేదని, ఉగ్రవాదాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కేంద్రానికి అండ గా ఉంటమాని భరోసా ఇచ్చిన సంగతిని వానతి శ్రీనివాసన్‌ గుర్తుంచుకోవాలన్నారు. రాష్ట్రంలో ఎన్నటికీ మత ఉగ్రవాదం ప్రవేశించే అవకాశమే లేదని, అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి నిధులు సకాలంలో విడుదలయ్యేలా చర్యలు తీసుకుంటే సంతోషిస్తానని స్టాలిన్‌ అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

హైదరాబాద్‌-విజయవాడ హైవే 6 లేన్లుగా విస్తరణకు 5 వేల కోట్లు

డిజిటల్ లైంగిక నేరాలపై చట్టమేదీ?

చిన్నారి ప్రాణం తీసిన పల్లీ గింజ

Read Latest Telangana News and National News

Updated Date - Apr 29 , 2025 | 12:24 PM