ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Speaker: సీఎం స్టాలిన్‌కు నటించడం ఇష్టం ఉండదు..

ABN, Publish Date - May 28 , 2025 | 12:23 PM

శాసనసభ స్పీకర్ అప్పావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి స్టాలిన్‌కు నటించడమంటే ఇష్టంలేదని.. ప్రజల అవసరాలను తీర్చడమే ఆయన అభిమతమని ఆయన అన్నారు. తిరునల్వేలిలో ఆయన మీడియాతో మాట్లాడారు.

- స్పీకర్‌ అప్పావు

చెన్నై: ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin)కు నటించడమంటే ఇష్టంలేదని, ప్రజల అవసరాలను తీర్చడమే ఆయన అభిమతమని స్పీకర్‌ అప్పావు(Speaker Appavu) పేర్కొన్నారు. తిరునల్వేలిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ అనే అంశంపై సోమవారం జరిగిన సదస్సుకు సంబంధించి రాజకీయ నాయకులు తమ అభిప్రాయాలను తెలియజేశారని, ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఏమాత్రం నటన ప్రదర్శించలేదన్నారు.


దేవాదాయశాఖ అధ్వర్యంలో కళాశాలలు నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి చేసిన ప్రకటనకు వ్యతిరేకంగా కొంతమంది న్యాయస్థానానికి వెళ్ళి స్టే తీసుకున్నారని తెలిపారు. అందరూ సమానులేనన్న సంకల్పంతో డీఎంకే ప్రభుత్వం పరిపాలిస్తోందని, ఏమైన కొరతలున్నట్లు చూపిస్తే వెంటనే పరిష్కరింపజేస్తోందన్నారు.


అసెంబ్లీ కార్యక్రమాలను టీవీలో ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు కొన్ని విధివిధాలున్నాయని స్పీకర్‌గా తాను వాటినే పాటిస్తున్నానని, అయినప్పటికీ ప్రతిపక్షం కోరిక మేరకు ఈ వ్యవహారంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. శాసన సభ్యులు అసెంబ్లీలో ఎలాంటి అంశాల గురించి మాట్లాడాలన్నపై శిక్షణ ఇప్పిస్తున్నామని, దశలవారీగా ప్రత్యక్షప్రసారం చేసే పనులు త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు.


రాష్ట్ర అసెంబ్లీని ప్రారంభించి 104ఏళ్ళు పూర్తవుతున్నాయని, 1952వ సంవత్సరం తర్వాత అసెంబ్లీలో వివిధ పార్టీల నాయకులు మాట్లాడిన ప్రసంగ పాఠాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నట్లు తెలిపారు. 1921 నుండి 1952 వరకు అసెంబ్లీ తీసుకున్న చర్యలు, రాతప్రతులకు సంబంధించిన పరిశోధన ముమ్మరంగా జరుగుతున్నాయని, తర్వాత జరగబోయే అసెంబ్లీ సమావేశాలకు ముందు ఈ పనులన్నింటిని పూర్తిచేయనున్నట్లు స్పీకర్‌ అప్పావు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి.

Gold Rates Today: గుడ్ న్యూస్..వరుసగా రెండోరోజు తగ్గిన బంగారం ధరలు..

Miss World 2025: మిస్‌ వరల్డ్‌ ఫైనల్స్‌... 3 గంటలు.. 3500 మంది ప్రేక్షకులు

Read Latest Telangana News and National News

Updated Date - May 28 , 2025 | 12:23 PM