MK Stalin: సుప్రీంకోర్టులో అధికార భాషగా తమిళం
ABN, Publish Date - Jun 17 , 2025 | 05:05 AM
సుప్రీంకోర్టు, మద్రాసు హైకోర్టులో తమిళాన్ని అధికారిక భాషగా అమలు చేయాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ డిమాండ్ చేశారు.
తమిళనాడు సీఎం స్టాలిన్ డిమాండ్
చెన్నై, జూన్ 16 (ఆంధ్రజ్యోతి): సుప్రీంకోర్టు, మద్రాసు హైకోర్టులో తమిళాన్ని అధికారిక భాషగా అమలు చేయాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ డిమాండ్ చేశారు. సోమవారం తంజావూరులో జరిగిన డీఎంకే ప్రముఖుడి వివాహ వేడుకలో పాల్గొన్న సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ సుందరేశ్, మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పుగళేంది వధూవరులను ఆశీర్వదిస్తూ తమిళంలో ప్రసంగించారు.
అనంతరం స్టాలిన్ ప్రసంగిస్తూ... తన చేతులమీదుగా జరిగిన ఆదర్శవివాహ వేడుకలో న్యాయమూర్తులిద్దరూ తమిళంలో ప్రసంగించి వధూవరులను ఆశీర్వదించడం సంతోషంగా ఉందన్నారు. ప్రాచీన భాష అయిన తమిళం ఔన్నత్యాన్ని మరింతగా పెంచేలా దానిని సుప్రీంకోర్టు, మద్రాసు హైకోర్టులో అధికారభాషగా, వినియోగ భాషగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
Updated Date - Jun 17 , 2025 | 05:05 AM