Supreme Court: తోటివారికి సేవ చేయడమే దేవుడిపై నిజమైన ప్రేమ
ABN, Publish Date - Jul 22 , 2025 | 06:20 AM
తోటివారికి సేవ చేయడమే దేవుడిపై అసలైన ప్రేమగా సుప్రీంకోర్టు అభివర్ణించింది..
తిరుమలేశుడి పూజల్లో స్వదేశీ గోవుల పాలేవాడాలన్న పిటిషన్‌పై సుప్రీంకోర్టు వ్యాఖ్య
న్యూఢిల్లీ, జూలై 21: తోటివారికి సేవ చేయడమే దేవుడిపై అసలైన ప్రేమగా సుప్రీంకోర్టు అభివర్ణించింది. తిరుమల శ్రీవారికి పూజాదికాల్లో స్వదేశీ గోవుల పాలు మాత్రమే వాడేలా తిరుమల తిరుపతి దేవస్థానాల(టీటీడీ)ను ఆదేశించాలన్న పిటిషన్‌పై విచారణకు నిరాకరించింది. ఇంతకంటే ముఖ్యమైన అంశాలు ఉన్నాయని.. తోటి మానవులకు సేవ చేయడంలోనే దేవుడిపై అసలైన ప్రేమ ఇమిడి ఉందని.. ఇలాంటి వాటిలో కాదని జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ ఎన్.కోటీశ్వర్‌సింగ్‌తో కూడిన ధర్మాసనం సోమవారం స్పష్టంచేసింది. స్వామివారి పూజలు, ప్రసాదాల తయారీలో స్వదేశీ గోవుల పాలు మాత్రమే వాడేలా టీటీడీకి ఆదేశాలివ్వాలని కోరుతూ ‘యుగ తులసి ఫౌండేషన్’ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఆగమ శాస్త్రాల ప్రకారం పూజలు నిర్వహించాలని.. ఈ మేరకు చేసిన తీర్మానాన్ని అమలు చేయాలని ఆ సంస్థ తరఫు న్యాయవాది విచారణ సందర్భంగా న్యాయస్థానాన్ని కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆర్టీఐలో సామాజిక న్యాయం ఎక్కడ? ప్రభుత్వానికి ఎమ్మెల్సీ కవిత సూటి ప్రశ్న..
రేవంత్ నాటుకోడి.. కేటీఆర్ బాయిలర్ కోడి
Read latest Telangana News And Telugu News
Updated Date - Jul 22 , 2025 | 06:20 AM