AS Oka: తల్లి మరణం.. పదవీ విరమణ రోజు.. అయినా 11 తీర్పులిచ్చిన సుప్రీం జడ్జి ఓకా
ABN, Publish Date - May 23 , 2025 | 04:05 PM
సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎఎస్ ఓకా చరిత్రనే మార్చారు. పదవీ విరమణ రోజు సాంప్రదాయాల్ని పక్కనపెట్టి పనే పరమావధి అని చేసి చూపించారు. తల్లి చనిపోయి ఒక్క రోజు కూడా గడవకముందే కోర్టుకు వచ్చి 11 తీర్పులిచ్చారు.
దటీజ్..జస్టిస్ ఓకా. అవును సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎఎస్ ఓకా(AS Oka) చరిత్రనే మార్చారు. తన పదవీ విరమణ(Retirement Day)రోజు సాంప్రదాయాల్ని పక్కనపెట్టి పనే పరమావధి అని చేసి చూపించారు. ఎంతో ప్రేమ ఉన్న తన తల్లిని కోల్పోయి ఒక్క రోజు కూడా గడవగముందే కోర్టుకు హాజరయ్యారు. అంతేకాదు, ఏకంగా చివరి రోజున 11 తీర్పులు ఇచ్చారు. "పదవీ విరమణ" అనే పదాన్ని తాను ద్వేషిస్తానని, చివరి రోజున పని చేయకపోవడం అనే సంప్రదాయంతో తాను ఏకీభవించనని ఓకా చెప్పారు.
సుప్రీంకోర్టు(Supreme Court) న్యాయమూర్తి జస్టిస్ ఓకా శనివారం (మే 24న) పదవీ విరమణ చేయబోతున్నారని బార్ అండ్ బెంచ్ ప్రకటించింది. దీనికి ముందు రోజు ముందు ఓకా తన తల్లి చనిపోవడంతో అంత్యక్రియలకు హాజరు కావడానికి ముంబైకి బయలుదేరి వెళ్లారు. ఒక్క రోజులోనే ఢిల్లీకి తిరిగివచ్చి కోర్టుకు హాజరయ్యారు. పదవీ విరమణ రోజున పని చేయకూడదనే సంప్రదాయాన్ని పక్కనపెట్టి జస్టిస్ ఓకా తన సాధారణ బెంచ్‌లో భాగంగా 11 తీర్పులు వెలువరించారు. తర్వాత చీఫ్ జస్టిస్ బిఆర్ గవైతో కలిసి ఉత్సవ బెంచ్‌కి వెళ్లారు.
కాగా, ఈ వారం ప్రారంభంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయిన ఓకాకు సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ (SCOARA) అభినందన సభ ఏర్పాటు చేసింది. ఆ సభలో జస్టిస్ ఓకా మాట్లాడుతూ చివరి రోజున పని చేయకూడదనే సంప్రదాయంతో తాను ఏకీభవించనని సభా ముఖంగా ప్రకటించారు. “పదవీ విరమణ చేసే న్యాయమూర్తి చివరి రోజున పని చేయకూడదనే సుప్రీంకోర్టులో అనుసరించే ఒక సంప్రదాయాన్ని నేను ఆమోదించను. ఆ సంప్రదాయాన్ని వదిలించుకోవడానికి మనకు కొంత సమయం పడుతుంది, కానీ కనీసం చివరి రోజున నేను రెగ్యులర్ బెంచ్‌లో కూర్చుని కొన్ని తీర్పులు ప్రకటించడంలో నాకు సంతృప్తి ఉంది” అని ఆయన చెప్పారు. "పదవీ విరమణ" అనే పదాన్ని తాను ద్వేషిస్తున్నానని, జనవరి 2025 నుండి వీలైనన్ని ఎక్కువ కేసులు వినాలని నిర్ణయించుకున్నానని, అలాగే పనిచేశానని ఆయన అన్నారు.
జస్టిస్ ఎఎస్ ఓకా ఎవరు?
మే 25, 1960న జన్మించిన జస్టిస్ ఓకా, 1985లో బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి వీపీ టిప్నిస్ చాంబర్‌లో చేరి తన కెరీర్‌ను ప్రారంభించారు. బాంబే విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేట్ అయిన ఆయన 2003లో బాంబే హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. తరువాత 2005లో శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. బాంబే హైకోర్టులో పదవీకాలం ముగిసిన తర్వాత, జస్టిస్ ఓకా 2019లో కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2021లో భారత సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందారు.
ఇవీ చదవండి:
మైసూర్ శాండల్ బ్రాండ్ అంబాసిడర్‌గా తమన్నా..విమర్శలు
నేడు ఆర్సీబీ vs హైదరాబాద్ మ్యాచ్..ఆర్సీబీ ఓడితే
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - May 23 , 2025 | 04:13 PM