Tamannaah Bhatia: మైసూర్ శాండల్ బ్రాండ్ అంబాసిడర్‌గా తమన్నా భాటియా.. సోషల్ మీడియాలో విమర్శలు
ABN , Publish Date - May 23 , 2025 | 11:18 AM
కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కర్ణాటక మైసూర్ శాండల్ (Mysore Sandal) సబ్బుకు తమన్నా భాటియా(Tamannaah Bhatia)ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించారు. దీంతో స్థానిక హీరోయిన్లైన రశ్మిక, శ్రీనిధి శెట్టి సహా పలువురి అభిమానులు సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు.
కర్ణాటక ప్రభుత్వ రంగ సంస్థ కర్ణాటక సబ్బులు డిటర్జెంట్స్ లిమిటెడ్ (KSDL) తన ప్రసిద్ధ మైసూర్ శాండల్(Mysore Sandal) సబ్బు విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ సబ్బు బ్రాండ్ అంబాసిడర్‌గా నటి తమన్నా భాటియా (Tamannaah Bhatia)ను నియమించింది. రూ. 6.2 కోట్ల విలువైన ఈ ఒప్పందం రెండు సంవత్సరాల పాటు కొనసాగుతుంది. అయితే తమన్నా నియామకంపై కర్ణాటకలో అనేక విమర్శలు వస్తున్నాయి. స్థానిక హీరోయిన్లు రష్మిక మందన్న, రుక్మిణి వసంత్, శ్రీనిధి శెట్టి వంటి వారిని పక్కన పెట్టి వేరే వారిని ఎందుకు నియమించారని సోషల్ మీడియా వేదికగా అనేక మంది అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
కావాలనే చేశారా..
అంతేకాదు ఈ నిర్ణయం ప్రభుత్వం కావాలనే తీసుకుందని సోషల్ మీడియాలో పలువురు ఆరోపిస్తున్నారు. గతంలో ఓ ప్రభుత్వ కార్యక్రమానికి రష్మిక మందన్న సహా పలువురు హీరోయిన్లు హాజరుకావాలని చెప్పినా కూడా రాలేదు. దీంతో వారిని ప్లాన్ ప్రకారమే ప్రభుత్వం పక్కన పెట్టిందని అంటున్నారు. స్థానిక నటీనటులను పక్కన పెట్టి ఇతర ప్రాంతాల వారికి అవకాశం ఇవ్వడమేంటని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో ఆయా నటీనటుల అభిమానులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు చేస్తున్నారు.

మంత్రి పాటిల్ వివరణ
ఈ విమర్శలపై వాణిజ్య, పరిశ్రమల మంత్రి MB పాటిల్ స్పందించారు. కర్ణాటక మార్కెట్‌ను దాటి దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా బ్రాండ్‌ను విస్తరించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తమన్నా భాటియా సోషల్ మీడియా ప్రభావం, బ్రాండ్‌తో అనుసంధానం, యువతలో గుర్తింపు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు. ఈ క్రమంలో KSDL, మైసూర్ శాండల్ సబ్బును ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందేలా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.
ప్రస్తుతం ఈ ఉత్పత్తి 23 దేశాల్లో లభ్యమవుతోంది. 2026 నాటికి 80 దేశాలకు విస్తరించాలన్నది సంస్థ లక్ష్యం. ఈ క్రమంలో తమన్నా భాటియా వంటి ప్రముఖ నటిని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడం ద్వారా అంతర్జాతీయ మార్కెట్లో బ్రాండ్ గుర్తింపును పెంచుకోవడంలో సహాయపడుతుందని భావిస్తున్నారు. మైసూర్ శాండల్ సబ్బు, 1916లో స్థాపించబడిన గవర్నమెంట్ సబ్బుల ఫ్యాక్టరీ ద్వారా తయారవుతుంది.
ఇవీ చదవండి:
బాబోయ్ మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు..
నేడు ఆర్సీబీ vs హైదరాబాద్ మ్యాచ్..ఆర్సీబీ ఓడితే
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి