ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Supreme Court: ఓటర్ల జాబితాను సవరించకపోతే ఎలా: సుప్రీం

ABN, Publish Date - Aug 14 , 2025 | 05:16 AM

ఓటర్ల జాబితాను మార్చకుండా స్థిరంగా ఉంచడానికి వీలుపడదని, ఎప్పటికప్పుడు సవరించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. లేకపోతే చనిపోయినవారి పేర్లను, వలసదారులు, ఇతర నియోజకవర్గాలకు వెళ్లిన వారి పేర్లను ఎన్నికల కమిషన్‌ ఎలా తొలగించగలుగుతుందని ప్రశ్నించింది.

న్యూఢిల్లీ, ఆగస్టు 13: ఓటర్ల జాబితాను మార్చకుండా స్థిరంగా ఉంచడానికి వీలుపడదని, ఎప్పటికప్పుడు సవరించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. లేకపోతే చనిపోయినవారి పేర్లను, వలసదారులు, ఇతర నియోజకవర్గాలకు వెళ్లిన వారి పేర్లను ఎన్నికల కమిషన్‌ ఎలా తొలగించగలుగుతుందని ప్రశ్నించింది. బిహార్లో ఓటర్ల జాబితాల సవరణ(ఎ్‌సఐఆర్‌) ఓటర్లకు అనుకూలంగా, ప్రయోజనకరంగా ఉందని వ్యాఖ్యానించింది. నివాస గుర్తింపు కోసం ఆధార్‌ కార్డును మినహాయించి.. 11 గుర్తింపు కార్డులు చూపించేందుకు ఈసీ వెసులుబాటు కల్పించడంపై హర్షం వ్యక్తంచేసింది. గతంలో ఏడు డాక్యుమెంట్లనే సూచించిందని గుర్తుచేసింది. బిహార్లో ప్రత్యేక సవరణ.. చట్టానికి లోబడి లేదని, దానిని కొట్టివేయాలన్న వినతితో విభేదించింది. ఆ రాష్ట్రంలో ఎస్‌ఐఆర్‌ చేపట్టడాన్ని సవాల్‌ చేస్తూ ఏడీఆర్‌, ఆర్‌జేడీ, కాంగ్రెస్‌ దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు బుధవారం విచారణ కొనసాగించింది.

ఓటర్ల జాబితాను సవరించే విచక్షణాధికారాన్ని రాజ్యాంగంలోని 324వ అధికరణ ఎన్నికల కమిషన్‌కు కట్టబెట్టిందని తెలిపింది. ‘‘బిహార్‌లో ఈసీ ‘విస్తృత’ అనే పదాన్ని మాత్రమే అదనంగా చేర్చింది’ అని జస్టిస్‌ బాగ్చీ చెప్పారు. ప్రస్తుత వ్యవహారం రాజ్యాంగ హక్కు, రాజ్యాంగ అధికారానికి మధ్య పోరాటమని అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా, బెంగాల్లో ఎస్‌ఐఆర్‌ చేపట్టడంపై ప్రస్తుతం విచారణ జరపబోమని.. ఆ తర్వాత చేపడతామని ధర్మాసనం స్పష్టంచేసింది. 2026 వరకు సమయం ఉందని, ఇప్పుడు అక్కడ ఏమీ జరుగబోవడం లేదని తెలిపింది. బెంగాల్‌ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది గోపాల్‌ శంకరనారాయణన్‌, టీఎంసీ ఎంపీ-న్యాయవాది అయిన కల్యాణ్‌ బెనర్జీ ఈ అంశాన్ని లేవనెత్తినప్పుడు ఈ వ్యాఖ్యలు చేసింది.

ఈ వార్తలు కూడా చదవండి..

బిహార్ ఓటరు సవరణపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..

రిమాండ్ పొడిగింపు.. కోర్టు వద్ద చెవిరెడ్డి హల్‌చల్

For More National News And Telugu News

Updated Date - Aug 14 , 2025 | 05:16 AM