Supreme Court Elderly Prisoners: వృద్ధ ఖైదీల విడుదలకు ఉమ్మడి విధానం ఉండాలి
ABN, Publish Date - Jul 19 , 2025 | 03:52 AM
వృద్ధ ఖైదీల విడుదలకు అన్ని రాష్ట్రాలు ఉమ్మడిగా నిబంధనలు రూపొందించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు..
న్యూఢిల్లీ, జూలై 18: వృద్ధ ఖైదీల విడుదలకు అన్ని రాష్ట్రాలు ఉమ్మడిగా నిబంధనలు రూపొందించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ప్రస్తుతం కారాగార నిబంధనలు రాష్ట్రాల వారీగా ఉన్నాయని తెలిపింది. అందువల్ల 70 ఏళ్లు దాటినవారు, నయంకాని రోగాలతో బాధపడుతూ అంత్యదశలో ఉన్న ఖైదీలను విడుదల చేసేందుకు ఏకరూప విధానాలను రూపొందించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. వృద్ధ ఖైదీల విడుదల విషయమై జాతీయ న్యాయ సేవా సంస్థ (నల్సా) దాఖలు చేసిన వ్యాజ్యంపై శుక్రవారం విచారణ జరిపిన జస్టిస్ విక్రంనాథ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
ఇవి కూడా చదవండి
యూట్యూబ్ హైప్ ప్రారంభం.. ఎలా ఉపయోగించాలో తెలుసా..
ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jul 19 , 2025 | 03:52 AM