Poison In Water Tank: హెచ్‌ఎంను బదిలీ చేయించాలని ట్యాంకులో విషం
ABN, Publish Date - Aug 04 , 2025 | 04:14 AM
పాఠశాల ప్రధానోపాధ్యాయుని బదిలీ చేయించాలని కుట్రపన్ని విద్యార్థులు తాగే తాగునీటి ట్యాంకులో విషం
బెంగళూరు, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): పాఠశాల ప్రధానోపాధ్యాయుని బదిలీ చేయించాలని కుట్రపన్ని విద్యార్థులు తాగే తాగునీటి ట్యాంకులో విషం కలిపారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురిని కర్ణాటక పోలీసులు అరెస్టు చేశారు. సవదత్తి తాలూకా హూళికట్టి ప్రభుత్వ పాఠశాలలో 13 ఏళ్లుగా హెచ్‌ఎంగా కొనసాగుతున్న సులేమాన్‌ను బదిలీ చేయించాలని సాగర్ పాటిల్, నాగనగౌడ పాటిల్, కృష్ణ మాదర కుట్ర పన్నారు. హెచ్‌ఎంకు చెడ్డపేరు వస్తే ఉన్నతాధికారులు బదిలీ చేస్తారని వీరు భావించారు జూలై 14న ట్యాంకులో విషం కలిపారు. ఆ నీటిని తాగి 11 మంది విద్యార్థులు అస్వస్థతకు లోనయ్యారు.
చివరి సి-295 భారత్‌కు చేరింది.. అప్పగింతలు పూర్తి చేసిన స్పెయిన్
తేజస్వి యాదవ్‌కు ఎన్నికల కమిషన్ నోటీసు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Aug 04 , 2025 | 04:14 AM