ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Anti Defection Law: స్పీకరే స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవాలని కోర్టు చెప్పింది

ABN, Publish Date - Aug 01 , 2025 | 04:21 AM

అసెంబ్లీ వ్యవహారాలపై న్యాయస్థానం జోక్యం పరిమితమేనని, కానీ స్పీకరే స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవాల్సి

  • సీనియర్‌ న్యాయవాది జంధ్యాల శంకర్‌

న్యూఢిల్లీ, జూలై 31(ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ వ్యవహారాలపై న్యాయస్థానం జోక్యం పరిమితమేనని, కానీ స్పీకరే స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని సుప్రీం కోర్టు చెప్పిందని సీనియర్‌ న్యాయవాది జంధ్యాల శంకర్‌ తెలిపారు. పదో షెడ్యూల్‌ కింద స్పీకర్‌కు ట్రైబ్యునల్‌కు ఉన్న అధికారాలుంటాయని, స్పీకర్‌కు న్యాయపరమైన అధికారాలున్నాయని, అందువల్ల ఆ పదవి న్యాయసమీక్షకు అతీతం కాదని కోర్టు భావించిందని తెలిపారు. అసెంబ్లీ వ్యవహారాలపై న్యాయస్థానం జోక్యం పరిమితమేనని, కానీ స్పీకర్‌ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పిందన్నారు. స్పీకర్‌ సకాలంలో నిర్ణయం తీసుకోకపోతే గవర్నర్‌, ఎన్నికల కమిషన్లతో ప్రత్యామ్నాయ యంత్రాంగం ఏర్పాటు చేసే విషయం పార్లమెంట్‌ నిర్ణయించాల్సి ఉంటుందని సుప్రీం కోర్టు తెలిపిందని వివరించారు. గతంలో స్పీకర్‌ 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని జస్టిస్‌ రోహింగ్టన్‌ నారిమన్‌ ఇచ్చిన తీర్పును జస్టిస్‌ గవాయి ఉటంకించారని తెలిపారు. అనర్హత పిటిషన్లపై స్పీకర్‌ పదవిలో ఉన్నవారు సకాలంలో నిర్ణయం తీసుకోకపోతే.. శస్త్రచికిత్స విజయవంతమైనా, రోగి మరణించినట్టే అవుతుందని కోర్టు వ్యాఖ్యానించిందన్నారు. అనర్హత వేటు పడిన వారు హైకోర్టుకు అప్పీలుకు వెళ్లే అవకాశముందన్నారు. రాజ్యాంగ బెంచ్‌కు వెళ్లాలన్న అభ్యర్థనను సుప్రీం అంగీకరించలేదని పెద్ద బెంచ్‌కు వెళ్లే అవకాశముండదని శంకర్‌ చెప్పారు.

ఈ వార్తలు కూడా చదవండి..

జగన్ పర్యటన.. ప్రశాంతి రెడ్డి రియాక్షన్

జగన్ జైలుకు వెళ్తారా అంటే.. లోకేష్ ఏమన్నారంటే..

For More Telangana News And Telugu News

Updated Date - Aug 01 , 2025 | 04:21 AM