ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Odisha Hospital: తప్పుడు ఇంజెక్షన్‌తో ఆరుగురి మృతి!

ABN, Publish Date - Jun 05 , 2025 | 04:28 AM

ఒడిశాలోని ఒక ఆసుపత్రిలో వివిధ వార్డుల్లో చికిత్స పొందుతున్న ఆరుగురు రోగులు కొన్ని గంటల వ్యవధిలో అనుమానాస్పద రీతిలో మృతి చెందారు.

  • ఒడిశాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం

  • నర్సు నిర్లక్ష్యమే కారణమన్న బంధువులు ఘటనపై విచారణకు కమిటీ

కోరాపూట్‌, జూన్‌ 4: ఒడిశాలోని ఒక ఆసుపత్రిలో వివిధ వార్డుల్లో చికిత్స పొందుతున్న ఆరుగురు రోగులు కొన్ని గంటల వ్యవధిలో అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. సిబ్బంది ఇచ్చిన తప్పుడు ఇంజెక్షన్‌ కారణంగానే ఈ మరణాలు సంభవించాయని మృతుల కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఒడిశాలోని కోరాపూట్‌ జిల్లాలోని షహీద్‌ లక్ష్మణ్‌ నాయక్‌ ప్రభుత్వ వైద్య కళాశాలలో మంగళవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది.


ఆపరేషన్‌ తరువాత కూడా తమ వారు ఆరోగ్యంగానే ఉన్నారని కానీ ఓ నర్సు వచ్చి ఇంజెక్షన్‌ ఇచ్చిన తరువాతే ప్రాణాలు కోల్పోయినట్లు ఓ మృతుని కుటుంబసభ్యులు ఆరోపించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ సుశాంత కుమార్‌ స్పందిస్తూ మృతిచెందిన వారందరూ కూడా తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారన్నారు. మరోవైపు ఒడిశా ప్రభుత్వం ఈ ఘటనపై విచారణకు ఆదేశిస్తూ ఓ కమిటీని ఏర్పాటు చేసింది.

Updated Date - Jun 05 , 2025 | 07:28 AM