ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Shashi Tharoor: రెక్కలు నీవి.. ఆకాశం ఎవరిదీ కాదు : థరూర్‌

ABN, Publish Date - Jun 26 , 2025 | 05:26 AM

ఎగిరేందుకు అనుమతి కోరకు. రెక్కలు నీవి. ఆకాశం ఎవరిదీ కాదు అంటూ కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ ఎక్స్‌లో వ్యాఖ్యలు చేశారు.

న్యూఢిల్లీ, జూన్‌ 25: ‘‘ఎగిరేందుకు అనుమతి కోరకు. రెక్కలు నీవి. ఆకాశం ఎవరిదీ కాదు’’ అంటూ కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ ‘ఎక్స్‌’లో వ్యాఖ్యలు చేశారు. తన వ్యాఖ్యలకు ఆయన పక్షి చిత్రాన్ని జతచేశారు. దీనికిముందు శశిథరూర్‌పై ఖర్గే ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీని పదేపదే ప్రశంసలతో ముంచెత్తుతున్న శశిథరూర్‌కు పరోక్షంగా చురకలు అంటించారు.

కాంగ్రెస్‌ పార్టీకి దేశమే ప్రథమమని, కానీ కొందరు నేతలకు మాత్రం మోదీయే ప్రథమమని, ఆ తర్వాతే దేశం అని విమర్శించారు. ‘మోదీ సంకల్పం భారత్‌కు ప్రధాన ఆస్తి’ అంటూ ఇటీవల ఓ పత్రికకు రాసిన వ్యాసంలో శశిథరూర్‌ చేసిన వ్యాఖ్యలను ఖర్గే ఇలా ఎద్దేవాచేశారు.

Updated Date - Jun 26 , 2025 | 05:26 AM