ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Uttarkashi: ఉత్తరాఖండ్ ధరాలి సమీపంలో రెండో జల ఖడ్గ ప్రళయ ఘోష

ABN, Publish Date - Aug 05 , 2025 | 06:49 PM

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఇప్పుడు జల ప్రళయ ఘోష తాండవం చేస్తోంది. ఉత్తర కాశీలోని ధరాలి సమీపంలో రెండవ సారి జల ఖడ్గం తన ప్రతాపాన్ని చూపించింది. ఇప్పటికే ఈ ఉదయం ఒక్కసారిగా భీకర స్థాయిలో పర్వత సానువుల్లోంచి..

Uttarkashi

ఇంటర్నెట్ డెస్క్: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఇప్పుడు జల ప్రళయ ఘోష తాండవం చేస్తోంది. ఉత్తరకాశీ లోని ధరాలి సమీపంలో రెండవ సారి జల ఖడ్గం తన ప్రతాపాన్ని చూపించింది. ఇప్పటికే ఈ ఉదయం ఒక్కసారిగా భీకర స్థాయిలో పర్వత సానువుల్లోంచి వచ్చిన జల ఆగ్రహానికి ఇళ్లకు ఇళ్లే కొట్టుకుపోయాయి. కొందరు బురదలో చిక్కుపోయారు. మొత్తంగా ఈ ప్రాంతంలో దాదాపు 10 మంది మరణించారు.

అయితే, అంతటితో జల ప్రళయం ఆగలేదు. ఈ సాయంత్రం మరో సారి ఆకస్మిక వరద పర్వత సానువుల్లోంచి తన్నుకు వచ్చింది. భారీ వర్షాల కారణంగా ఇప్పటికే సంభవించిన ఆకస్మిక వరదలు ధరాలి ప్రాంతాన్ని తుడిచిపెట్టుకు పోయేలా చేశాయి. ఈ జల విపత్తును కళ్లారా చూసి.. కేవలం కొన్ని గంటలు గడువకముందే మరో ప్రళయం ఉత్తర కాశీని ముంచెత్తింది. ఫలితంగా ఉత్తరాఖండ్‌లోని సుఖి టాప్ ప్రాంతంలో జల విధ్వసం చెలరేగింది.

క్షణాల్లో, ధార్చుల-గుంజి మార్గం, గస్కు, మల్ఘాట్ ప్రాంతంలోని రోడ్లు అడ్డంగా చీలిపోయాయి. దీనికి తోడు అనేక ప్రాంతాల్లో రోడ్లపై కొండ చరియలు విరిగి పడ్డంతో రహదారులు మూసుకుపోయాయి. ఇలా మార్గంలో చిక్కుకుపోయిన ప్రయాణికులను NDRF బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఆయా మార్గాల్లో ప్రయాణించవద్దని పోలీసు అధికారులు ప్రజలను కోరుతున్నారు.

ఇవాళ సాయంత్రం సంభవించిన జల ఆగ్రహానికి సల్ధార్ సమీపంలోని జ్యోతిర్మత్-మలరి మోటార్ రోడ్డు కొట్టుకుపోయిందని చమోలి పోలీసులు కూడా తెలియజేశారు. ప్రయాణికులు.. స్థానిక నివాసితులు అనవసరమైన ప్రయాణాలను నివారించాలని చమోలి పోలీసులు అభ్యర్థించారు.

హర్షిల్‌లోని భారత ఆర్మీ శిబిరం నుండి దాదాపు 4 కి.మీ దూరంలో ఉన్న ధరాలి గ్రామం సమీపంలో కొండచరియలు విరిగిపడిన తర్వాత సైనిక సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. దాదాపు 15-20 మందిని తరలించారు. గాయపడినవారు హర్షిల్‌లోని ఆర్మీ వైద్య కేంద్రంలో వైద్య చికిత్స పొందుతున్నారు.

ఇవి కూడా చదవండి

గ్రానైట్‌ క్వారీని పరిశీలించిన ఒడిశా బృందం

గాజాలో యుద్ధాన్ని ఆపండి..!

Updated Date - Aug 05 , 2025 | 09:03 PM