Indian Divorce Alimony Case: భరణం కింద బీఎండబ్ల్యూ కారు,ముంబైలో ఇల్లు, 12 కోట్లు
ABN, Publish Date - Jul 23 , 2025 | 03:53 AM
మనోవర్తి కింద భర్త నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? అని ఆమెను సీజేఐ జస్టిస్ గవాయ్ అడగ్గా
భర్త నుంచి కోరుతూ సుప్రీంకోర్టులో యువతి పిటిషన్
ఉద్యోగం చేయడంపైన దృష్టి పెట్టాలని సీజేఐ హితవు
న్యూఢిల్లీ, జూలై 22: మనోవర్తి కింద భర్త నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? అని ఆమెను సీజేఐ జస్టిస్ గవాయ్ అడగ్గా ‘‘నాకు బీఎండబ్ల్యూ హైఎండ్ మోడల్ కారు కావాలి. ముంబైలోని ఖరీదైన ఇల్లు, పోషణ కింద రూ.12 కోట్ల నగదును ఇప్పించండి’’ అని ఆ భార్య సమాధానమిచ్చింది. పెళ్లయిన రెండేళ్లలోపే ఓ జంట విడాకులకు సిద్ధమైతే.. పెద్ద మొత్తంలో భరణం కోరుతూ భార్య సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. దీన్ని విచారించిన సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్, భారీ మొత్తంలో ఆ యువతి మనోవర్తి కోరడంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘పెళ్లయిన 18 నెలలకే మీరు విడాకులు తీసుకుంటున్నారు. 18నెలల వైవాహిక జీవితానికి ప్రతిగా నెలకు రూ.కోటి చొప్పున భరణం కింద భర్తను కోరుతున్నారా’’ అని వ్యాఖ్యానించారు. ‘‘మీరు ఎంబీఐ చదివారు. ఐటీ ప్రొఫెషనల్ కూడా. మీకు సంపాదించుకునే సామర్థ్యం ఉంది. చక్కని ఉద్యోగం చేసుకోండి’’ అని పిటిషనర్‌కు సూచించారు. దీనికి ఆమె బదులిస్తూ.. తన భర్త పెద్ద ధనవంతుడని వివరించారు. తాను మానసిక సమస్యలతో బాధపడుతున్నానని ఆరోపిస్తూ ఆయనే తనకు విడాకులివ్వడానికి నిర్ణయించుకున్నారని చెప్పారు. ‘‘నేనేమైనా మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లుగా అనిపిస్తోందా మై లార్డ్’’ అని జస్టిస్ గవాయ్‌ని ఆమె ప్రశ్నించారు. అయితే.. ముంబైలోని కాల్‌పతరులోని ఇల్లు.. అక్కడున్న మంచి భవనాల్లో ఒకటని.. ఆ ఇల్లు... లేదంటే రూ.4 కోట్ల భరణం తీసుకోవాలని జస్టిస్ గవాయ్ ఆమెకు సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కోర్టును ఆశ్రయించిన మహిళ.. సీజేఐ ఆసక్తికర వ్యాఖ్యలు
ధన్‌ఖఢ్ రాజీనామా వెనుక నితీష్‌ను తప్పించే కుట్ర.. ఆర్జేడీ ఆరోపణ
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jul 23 , 2025 | 03:53 AM