ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Statehood Demand: జమ్మూకాశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరణ.. పహల్గామ్ దాడిని ప్రస్తావించిన సుప్రీం కోర్టు

ABN, Publish Date - Aug 14 , 2025 | 01:30 PM

Statehood Demand: 2024 సెప్టెంబర్ నుంచి అక్టోబర్ మధ్యలో జమ్మూకాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. కూటమి ప్రభుత్వం విజయం సాధించింది. 42 సీట్లకు గానూ కూటమి ప్రభుత్వం 27 సీట్లు గెలిచింది.

Statehood Demand

జమ్మా కాశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించటంపై సుప్రీం కోర్టు స్పందించింది. దేశ అత్యున్నత న్యాయస్థానం ఏప్రిల్ నెలలో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడిని ప్రస్తావించింది. ఉగ్రదాడిని, దాడి వల్ల ఏర్పడ్డ ప్రాంతీయ భద్రతా సమస్యలను విస్మరించలేమని తేల్చి చెప్పింది. గురువారం జమ్మా కాశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలన్న పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ నాయకత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. జమ్మూకాశ్మీర్‌కు రాష్ట్ర హోదాపై కీలక వ్యాఖ్యలు చేసింది.

‘పహల్గామ్ ఉగ్రదాడిని, దాడి కారణంగా జమ్మూకాశ్మీర్‌లో నెలకొన్న ప్రాంతీయ భద్రతా సమస్యల్ని విస్మరించలేము’ అని ధర్మాసనం పేర్కొంది. జమ్మా కాశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలంటూ దాఖలు అవుతున్న పిటిషన్లను కలిపి ఓ జాబితా చేయాలని విచారణ సందర్భంగా సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణ్ కోర్టును కోరారు. ఓ బెంచ్ ఏర్పాటు చేసి, ఓ కచ్చితమైన సమయాన్ని నిర్ణయిస్తే బాగుంటుందని అన్నారు. దీనికి చీఫ్ జస్టిస్ సమాధానం ఇస్తూ ‘ప్రభుత్వం నుంచి ముందు స్పందన రానివ్వండి’ అని అన్నారు.

కాగా, 2023 డిసెంబర్ నెలలో సుప్రీంకోర్టు జమ్మూకాశ్మీర్‌కు రాష్ట్ర హోదాపై విచారణ జరిపింది. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత రాష్ట్ర హోదా పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 2024 సెప్టెంబర్ నుంచి అక్టోబర్ మధ్యలో జమ్మూకాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. కూటమి ప్రభుత్వం విజయం సాధించింది. 42 సీట్లకు గానూ కూటమి ప్రభుత్వం 27 సీట్లు గెలిచింది. ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రి అయ్యారు. అయితే, కొత్త ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరం అవుతున్నా రాష్ట్ర హోదా పునరుద్ధరించకపోవటంపై సుప్రీం కోర్టులో వరుసగా పిటిషన్‌లు దాఖలు అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

కూతుర్ని చంపి సూసైడ్ డ్రామా.. ఆమె ప్రియుడి ఎంట్రీతో..

స్వాతంత్ర దినోత్సవం లాంగ్ వీకెండ్..ఈ మినీ గోవాకు వెళ్లి ఆస్వాదించండి..

Updated Date - Aug 14 , 2025 | 01:35 PM