ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Gokarna Cave: గోకర్ణ గుహలో ఇద్దరు పిల్లలతో రష్యా మహిళ

ABN, Publish Date - Jul 12 , 2025 | 06:02 PM

గుహ ప్రాంతం సమీపంలో ఇటీవల కొండచరియలు విరిగిపడటంతో పోలీస్ పెట్రోల్ టీమ్ రామతీర్ధ పర్వత ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తుండగా ఒక గుహ బయట ఎవరివో దుస్తులు కనిపించాయి. దీంతో వారు పైకి వెళ్లి చూడగా గుహలో ఒక మహిళ, ఇద్దరు చిన్నారులు కనిపించడంతో ఆశ్చర్యానికి లోనయ్యారు.

Russian woman

మంగళూరు: పుణ్యభూమి, కర్మభూమి, వేదభూమిగా, ఆధ్యాత్మిక దిక్సూచిగా భారతదేశం ప్రపంచ దేశాలను ఆకర్షిస్తూనే ఉంది. ఆధ్యాత్మికత కోసం ఎందరో విదేశీయులు ఇక్కడకు రావడం, కొందరు ఇక్కడి ఆధ్యాత్మికతతో తమ జీవితాన్ని పండించుకోవడం జరుగుతూనే ఉంది. తాజాగా ఇక్కడ ఆధ్యాత్మిక ప్రశాంతతకు ఆకర్షితురాలైన ఓ రష్యన్ మహిళ ఒకరు ఉత్తర కన్నడ జిల్లా కుంట తాలూకా రామతీర్ధ కొండల్లోని మారుమూల గుహలో జీవనం సాగిస్తోంది. ఆమెతో పాటు ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. దట్టమైన అడవులు, లోతైన మలుపులతో కూడిన ఈ సహజ గుహలో రెండు వారాలుగా ఆమె జీవనం సాగిస్తోంది. అక్కడే రుద్ర విగ్రహాన్ని పెట్టుకుని అనునిత్యం ధాన్యం సాగిస్తూ వచ్చింది. స్థానిక పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో ఈ విషయం వెలుగుచూసింది.

గుహ ప్రాంతం సమీపంలో ఇటీవల కొండచరియలు విరిగిపడటంతో పోలీస్ పెట్రోలింగ్ టీమ్ రామతీర్ధ పర్వత ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తుండగా ఒక గుహ బయట ఎవరివో దుస్తులు కనిపించాయి. దీంతో వారు పైకి వెళ్లి చూడగా గుహలో ఒక మహిళ, ఇద్దరు చిన్నారులు కనిపించడంతో ఆశ్చర్యానికి లోనయ్యారు. రష్యాకు చెందిన ఆ మహిళను 40 ఏళ్ల నైనా కుటినా అలియాస్ మోహిగా గుర్తించారు. ఆమెతో పాటు ఆరేళ్ల కుమార్తె ప్రేయ, నాలుగేళ్ల అమా ఉన్నారు. రెండు వారాలుగా ఇక్కడి క్లిష్ట వాతావరణంలో ఎలా జీవనం సాగించారు, ఏమి తిన్నారో తెలియక పోలీసులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

బిజినెస్ వీసా మీద రష్యా మహిళ ఇక్కడకు వచ్చిందని, అది 2017లోనే వీసా గడువు తీరిందని పోలీసు అధికారులు తెలిపారు. అప్పటి నుంచి ఇంతకాలం ఆమె ఎక్కడ ఉందనేది తెలియనప్పటికీ హిందూ ఫిలాసఫి పట్ల ఆకర్షితురాలైన ఆమె.. గోవా నుంచి గోకర్ణకు వచ్చినప్పుడు ఆక్కడి పర్వత ప్రాంతంలోని ప్రదేశం పట్ల అకర్షితురాలైనట్టు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆమెకు నచ్చచెప్పి గుహ నుంచి ఇద్దరు పిల్లల్నీ బయటకు తీసుకువచ్చి స్థానిక సాధ్వి ఒకరు నడుపుతున్న ఆశ్రమానికి పోలీసులు తరలించారు. ఇమిగ్రేషన్ అధికారులతో సంప్రదించి ఆమెను స్వదేశానికి పంపే ఏర్పాట్లు చేస్తామని పోలీసు అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి..

ఇంట్లో ఆంక్షలు, స్వేచ్ఛ కావాలనుకున్న రాధిక.. హత్య కేసులో కీలక సమాచారం

కుర్చీ దొరికితే వదలొద్దు.. డీకే ఆసక్తికర వ్యాఖ్యలు

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 12 , 2025 | 06:48 PM