ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Russia: భారత్‌, పాక్‌లు చర్చించుకోవాలి

ABN, Publish Date - May 18 , 2025 | 04:17 AM

సమస్యల పరిష్కారానికి భారత్‌,పాకిస్థాన్‌లు చర్చలు జరుపుకోవాలని రష్యా సూచించింది. ఇప్పటికే అమెరికా, చైనాలు ఇలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా తాజాగా ఆ జాబితాలో రష్యా చేరింది.

  • రష్యా సూచన

న్యూఢిల్లీ, మే 17: సమస్యల పరిష్కారానికి భారత్‌,పాకిస్థాన్‌లు చర్చలు జరుపుకోవాలని రష్యా సూచించింది. ఇప్పటికే అమెరికా, చైనాలు ఇలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా తాజాగా ఆ జాబితాలో రష్యా చేరింది. సరిహద్దుల్లో మిలటరీ చర్యల నిలుపుదల, కాల్పుల విరమణకు ఈ నెల పదో తేదీన కుదిరిన ఒప్పందం స్ఫూర్తిని కొనసాగించాలని తెలిపింది. ఘర్షణలు పునరావృతం కాకుండా విభేదాలను చర్చలు, సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలని, రాజకీయ అంగీకారానికి రావాలని పేర్కొంది.


మాస్కోలో రష్యా విదేశాంగ అధికార ప్రతినిధి మారియా జఖరోవా ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. భారత్‌-పాక్‌ల మధ్య తలెత్తిన ఘర్షణ, అనంతరం కుదిరిన కాల్పుల ఒప్పందంపై రష్యా వైఖరి ఏమిటంటూ విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆమె ఈ సమాధానం ఇచ్చారు. రెండు దేశాల మధ్య ప్రత్యక్ష చర్చలు జరగాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. చర్చలను పునఃప్రారంభించాలని అన్నారు

Updated Date - May 18 , 2025 | 04:17 AM