ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Leopard: మళ్లీ.. చిరుత సంచారం..

ABN, Publish Date - Mar 21 , 2025 | 01:22 PM

మళ్లీ.. చిరుత సంచారంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అది ఎప్పుడు దాడి చేస్తుందేమోననే భయంతో అటువైను వెళ్లేందుకు ప్రజలు సాహాసం చేయడం లేదు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.

- రాయచూరు సమీపంలో చిరుత జాడలతో భయం భయం

రాయచూరు(బెంగళూరు): నగర సమీపంలోని మలియాబాద్‌ అటవీ పరిసరాల్లో మరోసారి చిరుత(Leopard) కలకలం చెలరేగింది. గురువారం తెల్లవారు జామున గ్రామానికి చెందిన గేదె దూడను చిరుత చంపి వేయడంతో ఒక్కసారిగా గ్రామంలో భయానక వాతావరణం నెలకొంది. కొన్నాళ్ల క్రితం చిరుత సంచరిస్తున్నట్లు గ్రామస్థులు చేసిన ఫిర్యాదుపై నిఘా ఏర్పాటు చేసి బోను అమర్చిన అటవీ శాఖ అధికారులు నెల రోజుల క్రితం ఒక చిరుతను బంధించారు.

ఈ వార్తను కూడా చదవండి: Trains: చర్లపల్లి - కన్నియాకుమారి మధ్య ప్రత్యేక రైళ్లు


చిరుత బంధించిన వెంటనే ఊపిరి పీల్చుకున్న ప్రజలు ఆ సంగతే మరిచిపోయి ఉన్న తరుణంలో మరో సారి గేదెను చిరుత బలిగొనడం కలకలం రేపింది. ఈ సందర్భంగా కొంతమంది గ్రామస్థులు బుధవారం సాయంత్రం తాము పొలాల నుంచి తిరిగి ఉస్తుండగా చిరుత జాడలు కనిపించాయంటూ చెప్పడం ఒక్క సారిగా గ్రామంలో కలకల రేగింది. దీంతో ప్రజలు రాత్రి వేళ బయటికెళ్లాలంటే భయం పడే పరిస్థితి తలెత్తింది. కొన్ని పెంపుడు జంతువులను సైతం ప్రజలు ఇళ్లల్లో కట్టివేసుకోవడం గమనార్హం.


ఇప్పటికే అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసిన గ్రామస్థులు నిఘా ఏర్పాటు చేసి తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. గ్రామ పరిసరాలు పూర్తిగా దట్టమైన అడువులు ఉండడం వల్లే తమకు ఈ ప్రమాదం ఉందంటూ గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. దీని పై స్పందించిన జిల్లా అటవీ శాఖ అధికారి గ్రామస్థులు రాత్రివేళ బయటికి వెళ్లవద్దని ఇప్పటికే ట్ర్యాప్‌ కెమెరాలు ఏర్పాటు చేసి పెట్రోలింగ్‌ సిబ్బందిని కూడా పెంచామన్నారు. తప్పనిసరిగా చిరుతను బంధిస్తామని ఈ విషయంలో గ్రామస్థులు ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Online Betting: ముదిరిన బెట్టింగ్‌ వ్యవహారం.. తారలపై కేసులు

BJP: రాజాసింగ్‌కు బుల్లెట్‌ ప్రూఫ్‌ కారు

పంచుకు తింటే.. పట్టు వచ్చినట్లా?

Read Latest Telangana News and National News

Updated Date - Mar 21 , 2025 | 01:28 PM