ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

BJP leader Ravinder Raina: జమ్ముకశ్మీర్‌లో జవాన్లతో వీడియో .. గగ్గోలెత్తుతున్న కాంగ్రెస్ సహా విపక్షాలు

ABN, Publish Date - May 05 , 2025 | 06:32 PM

జమ్మూ కశ్మీర్ బీజేపీ మాజీ అధ్యక్షుడు రవీందర్ రైనాకు విపక్షాల నుంచి తలనొప్పులు ఎదురౌతున్నాయి. జవాన్లతో మంచుకొండల్లో పరుగెడుతున్న పోస్ట్.. 'అనుకున్నదొక్కటైతే.. అయ్యిందొక్కటా..' అన్నట్టు తయారైంది పరిస్థితి.

BJP J&K Ravinder Raina

BJP J&K Ravinder Raina: బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, జమ్మూ కశ్మీర్ బీజేపీ మాజీ అధ్యక్షుడు రవీందర్ రైనాకు విపక్షాల తలపోట్లు ఎదురౌతున్నాయి. ఆయన ఇటీవల చేసిన ఒక సోషల్ మీడియా పోస్టు.. అనుకున్నదొక్కటైతే.. అయ్యిందొక్కటా..అన్నట్టు తయారైంది. ఇంతకీ విపక్ష కాంగ్రెస్ దాని మిత్ర పక్షాలు దేశవ్యాప్తంగా ఇంత రాద్ధాంతం చేయడానికి రవీందర్ రైనా చేసిన తప్పేంటో, లేదా ఒప్పేంటో చూద్దాం..

జమ్ము కశ్మీర్ లో జవాన్లతో కలిసి మంచుకొండల్లో పరుగెడుతున్న ఒక వీడియోను రవీందర్ రైనా నిన్న తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో దాదాపు పది మంది జవాన్లతో పాటు ముందుకు పరుగెడుతున్నట్టుగా ఆ వీడియో ఉంది. ఈ వీడియోకు జైహింద్ స్లోగన్ కూడా పెట్టి ఆయన నెట్టింట్లో పోస్ట్ చేశారు. దీనిపైనే ఇప్పుడు రచ్చ రచ్చ చేస్తున్నాయి కాంగ్రెస్ సహా ఇండియా కూటమి పార్టీలు.

ఇంకా ఈ వీడియో గురించి ఏం చెప్పాలంటే.. రైనా మంచులో పరిగెడుతూ జవాన్లకు మరింత ఊపునిచ్చే విధంగా ప్రవర్తిస్తుండటం కనిపించింది. సదరు రీల్‌లో రవీందర్ రైనా నవ్వుతూ కనిపిస్తున్నారు. 'గులాల్' సినిమాలోని పియూష్ మిశ్రా పాట 'ఆరంభ్ హై ప్రచంద్' నేపథ్యంలో ఈ వీడియో ప్లే అవుతోంది. "జై హింద్" అనే శీర్షిక ను కూడా సదరు వీడియో టైటిల్ లో పెట్టారు. దీనినే ఇప్పుడు విపక్షాలు తప్పుపడుతున్నాయి.

26 మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్న పహల్గాం ఉగ్రవాద దాడి జరిగి రెండు వారాలు కూడా కాకముందే రవీందర్ రైనా ఈ పనులేంటని విపక్షాలు విమర్శిస్తున్నాయి. అంతేకాదు, తన రీల్ కోసం ఆయన భద్రతా సిబ్బందిని దుర్వినియోగం చేశారని ఆరోపిస్తున్నారు. పహల్గామ్ దాడి తర్వాత దేశం మొత్తం దుఃఖంలో ఉందని సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రీనాటే అన్నారు. "ఎవరో తన చిన్న కొడుకును, ఎవరో తన తండ్రిని, ఎవరో తన భర్తను కోల్పోయారు. ఈ వ్యక్తి సరదాగా గడుపుతున్న మూడ్‌లో ఉన్నాడా? అతను రీల్స్‌ను చేస్తున్నాడా? భద్రతా సిబ్బందిని దుర్వినియోగం చేస్తున్నాడా? వారికి ఇంత సిగ్గులేనితనం ఎక్కడిది? బీజేపీ లక్షణంలో అసహనం ఉందా?" అని ఆమె ప్రశ్నించారు.

శివసేన (యుబిటి) రాజ్యసభ ఎంపి ప్రియాంక చతుర్వేది ఈ పోస్ట్‌ను "రీల్ గేమ్ ఆన్ పాయింట్"గా అభివర్ణించారు. "మీకు ఇలాంటి భద్రత ఉంటే. మరి సరిహద్దులను ఎవరు రక్షిస్తారు. బిజెపి వాలోం కో బచనా బహుత్ జరూరి హై" అని ఆమె అన్నారు.

కాంగ్రెస్ కేరళ యూనిట్ Xలో ఈ రీల్‌ను షేర్ చేసింది. ఇది "బిజెపి నాయకులు లేదా నకిలీ పిఎంఓ అధికారులు కూడా పొందే" ట్రీట్మెంట్ అని పేర్కొంది. "కానీ 2000 మందికి పైగా పర్యాటకులు సందర్శించే చోట ఒక్క పోలీసు లేదా సైనిక వ్యక్తిని కూడా పోస్ట్ చేయలేదు. ఒక్క తుపాకీ కూడా కాల్చలేదు" అని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.

దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా మౌనంగా ఉంటారా అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఇలా ఉంటే, కాంగ్రెస్‌తో సంబంధం ఉన్న అనేక సోషల్ మీడియా హ్యాండిల్స్ ఈ రీల్ మీద బీజేపీ నాయకుడిని తీవ్రంగా విమర్శిస్తున్నాయి. అయితే, ఈ ఆరోపణలపై రవీందర్ రైనా ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Updated Date - May 05 , 2025 | 06:36 PM