ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Ayodhya Ram Darbar: అయోధ్య ఆలయంలో రామదర్బార్ సందర్శన షురూ

ABN, Publish Date - Jun 14 , 2025 | 03:54 PM

శనివారం సాయంత్రం 5-7, 7-9 గంటల మధ్య రెండు స్లాట్లలో రామ దర్బార్‌ను సందర్శించేందుకు పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించాలని నిర్ణయించిట్టు శ్రీ రామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టు సభ్యులు అనిల్ మిశ్రా తెలిపారు.

అయోధ్య: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామాలయం మొదటి అంతస్తులో రామ దర్బార్ (Ram Darbar) ప్రాణ ప్రతిష్ఠ అనంతరం తొలిసారిగా భక్తుల సందర్శనకు అనుమతిస్తున్నారు. శనివారం నుంచి భక్తులను రామ దర్బార్ సందర్శనకు అనుమతించాలని శుక్రవారం సాయంత్రం టెంపుల్ ట్రస్ట్ నిర్ణయం తీసుకుంది. దీంతో శనివారం సాయంత్రం 5-7, 7-9 గంటల మధ్య రెండు స్లాట్లలో రామ దర్బార్‌ను సందర్శించేందుకు పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించాలని నిర్ణయించిట్టు శ్రీ రామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టు సభ్యులు అనిల్ మిశ్రా తెలిపారు.

రామదర్బార్ ప్రతిష్ఠాపన జూన్ 5వ తేదీ ఉదయం 6 గంటలకు ప్రత్యేక పూజల అనంతరం మధ్యాహ్నం 1.25 నుంచి 1.40 గంటల మధ్య అభిజిత్ ముహూర్తంలో జరిగింది. రామాలయంలోని మొదటి అంతస్తులో రాముడు, సీత, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, హనుమంతుడితో కూడిని రామదర్బార్ విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. వీటితోపాటు ఆలయ ప్రాంగణంలో మరో ఏడు దేవాలయాల్లో విగ్రహాల ప్రాణప్రతిష్ఠ జరిగింది.

రామ్‌లల్లా దర్శనం తరహాలోనే రామదర్బార్ దర్శనానికీ పాసులు జారీ చేస్తున్నామని అనిల్ మిశ్రా తెలిపారు. ప్రతి రెండు గంటలకు ఒక స్లాట్‌ ఉంటుందని, ఒక్కో స్లాట్‌కు 300 పాసులు జారీ చేస్తామని చెప్పారు. ఉదయం 7-9, 9-11, మధ్యాహ్నం 1-3, 3-5, సాయంత్రం 5-7, 7-9 వరకూ దర్శనం స్లాట్‌లు ఉంటాయని చెప్పారు.

ఇవి కూడా చదవండి..

బోయింగ్‌ల కుదింపు?

15 ఏళ్ల తర్వాత కలిశారు.. విమానం విషాదం మిగిల్చింది..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 14 , 2025 | 04:03 PM