ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Rajnath Singh: ఐఎన్ఎస్ విక్రాంత్‌ పైనుంచి పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ వార్నింగ్

ABN, Publish Date - May 30 , 2025 | 02:58 PM

Defence Minister Rajnath Singh: 1971లో భారత్, పాకిస్థాన్‌ల మధ్య యుద్ధం జరిగినప్పుడు భారత నేవీ కూడా పాల్గొందని కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ గుర్తు చేశారు. భారత నేవీ దెబ్బకు పాక్ రెండుగా చీలిపోయిందని ఎద్దేవా చేశారు. ఆపరేషన్ సిందూర్ సమయంలోనూ భారత నేవీ రంగంలోకి దిగి ఉంటే.. ఈసారి పాక్ నాలుగు ముక్కలు అయ్యేదని చెప్పుకొచ్చారు.

Defence Minister Rajnath Singh

ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్‌కు భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. పాకిస్థాన్‌తో యుద్ధం జరిగినప్పుడు భారత నేవీ కనుక రంగలోకి దిగి ఉంటే.. పాకిస్థాన్‌ నాలుగు ముక్కలై ఉండేదని అన్నారు. యుద్దం సమయంలో భారత నేవీ మౌనంగా ఉంటూనే.. శత్రువుల గుండెల్లో దడ పుట్టించిందని అన్నారు. ఆపరేషన్ సిందూర్ సందర్భంగా నేవీ పాత్రను ఆయన కొనియాడారు. రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం ఐఎన్ఎస్ విక్రాంత్‌ను సందర్శించారు. ఐఎన్ఎస్ విక్రాంత్‌పై నిలబడి పాకిస్థాన్‌కు వార్నింగ్ ఇచ్చారు.


కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ‘ 1971లో భారత్, పాకిస్థాన్‌ల మధ్య యుద్ధం జరిగినప్పుడు భారత నేవీ కూడా యుద్ధంలో పాల్గొంది. భారత నేవీ దెబ్బకు పాక్ రెండుగా చీలిపోయింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత నేవీ రంగంలోకి దిగి ఉంటే.. ఈసారి పాక్ నాలుగు ముక్కలు అయ్యేది. ఆపరేషన్ సిందూర్ సమయంలో నేవీ మౌనంగా తన పని చేసుకుపోయింది. ప్రతీ భారతీయుడ్ని ఆశ్చర్యపరిచింది. మౌనంగా ఉంటూనే .. పాక్ ఆర్మీని ఓడించటంలో విజయవంతం అయింది. ఆపరేషన్ సిందూర్ సందర్భంగా ఎయిర్‌ఫోర్స్ పాక్ టెర్రర్ బేస్‌లను ధ్వంసం చేసింది.


అప్పుడు భారత నేవీ బలగాలు ఎంతో దూకుడుగా అరేబియా మహా సముద్రంలో మోహరించాయి. పాక్ నేవీ.. నీటి సరిహద్దులు దాటి ఇటువైపు రావడానికి ధైర్యం చేయలేకపోయింది. పాకిస్థాన్‌ చాలా అదృష్టం చేసుకుంది. ఒకవేళ ఆపరేషన్ సిందూర్ సమయంలో నేవీ రంగంలోకి దిగి ఉంటే పాక్ పరిస్థితి దారుణంగా ఉండేది. ఇప్పటి వరకూ జరిగిందంతా వామ్ అప్ మాత్రమే. ఈసారి పాకిస్థాన్ యుద్ధానికి దిగితే.. నేవీ కూడా రంగంలోకి దిగుతుంది. అప్పుడు పాక్ పరిస్థితి ఏమవుతుందో ఆ దేవుడికే తెలియాలి’ అని అన్నారు.


ఇవి కూడా చదవండి

రూ.48,520 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శ్రీకారం

రూ. 500 నోట్ల కట్టలు కిటికీలో నుంచి విసిరేసినా .. దొరికిపోయాడు

Updated Date - May 30 , 2025 | 04:24 PM