ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Live In Relationship: 70 ఏళ్లుగా సహజీవనం.. 90 ఏళ్ల వయసులో పెళ్లి..

ABN, Publish Date - Jun 08 , 2025 | 11:35 AM

Rajasthan Couple: రమాభాయ్ ఖరారి, జీవాలి దేవి 70 ఏళ్ల క్రితం ప్రేమించుకున్నారు. అప్పటినుంచి సహజీవనం చేస్తున్నారు. పెళ్లి చేసుకోకుండానే పిల్లల్ని కన్నారు. ఆ పిల్లలకు పెళ్లిళ్లు అయి వారికి కూడా పిల్లలు పుట్టారు.

Rajasthan Couple

భారతీయ సంస్కృతిలో పెళ్లికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఆ స్థానం ఏంటో రాజస్థాన్‌కు చెందిన 90 ఏళ్ల ఓ వృద్ధ జంట యావత్ ప్రపంచానికి మరోసారి చాటి చెప్పింది. ఆ జంట దాదాపు 70 ఏళ్ల నుంచి సహజీవనం చేస్తోంది. వారికి పిల్లలు, మనవళ్లు, మనవరాళ్లు కూడా ఉన్నారు. ఇన్నేళ్ల తర్వాత ఆ ఇద్దరూ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఆ జంట 70 ఏళ్ల తర్వాత పెళ్లి నిర్ణయం తీసుకోవడానికి ఓ బలమైన కారణం ఉంది. ఆ కారణం ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివేయాల్సిందే..


రాజస్థాన్, దుంగార్‌పుర్ జిల్లా, గలందర్‌ గ్రామానికి చెందిన రమాభాయ్ ఖరారి, జీవాలి దేవి 70 ఏళ్ల క్రితం ప్రేమించుకున్నారు. అప్పటినుంచి సహజీవనం చేస్తున్నారు. పెళ్లి చేసుకోకుండానే పిల్లల్ని కన్నారు. ఆ పిల్లలకు పెళ్లిళ్లు అయి వారికి కూడా పిల్లలు పుట్టారు. ప్రస్తుతం ఆ ఇద్దరి వయసు 90 దాటింది. ఇలాంటి టైంలో వారికి పెళ్లి గురించి ఆలోచన వచ్చింది. చనిపోయేనాటికి భార్యాభర్తల బంధంలోకి అడుగుపెట్టాలని అనుకున్నారు. ఇదే విషయాన్ని పిల్లలకు చెప్పారు. వారు కూడా ఏమాత్రం ఆలోచించకుండా ఓకే చెప్పారు.


ఊరి పెద్దలకు కూడా విషయం చెప్పారు. వారు కూడా అభ్యంతరం చెప్పలేదు. జూన్ 1వ తేదీన పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. ప్రీ వెడ్డింగ్ కార్యక్రమంలో భాగంగా బండోలి(బరాత్) కూడా జరిగింది. డీజే పెట్టించారు. గ్రామంలోని పెద్దలు, పిల్లలు అందరూ డ్యాన్స్‌లు చేసి అదరగొట్టారు. ఇక, జూన్ 4వ తేదీన ఇద్దరికీ ఘనంగా పెళ్లి జరిగింది. అగ్ని సాక్షిగా ఏడు అడుగులు నడిచి, మూడు ముళ్ల బంధంతో ఇద్దరూ పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం వీరి స్టోరీ మీడియాలో, సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఇవి కూడా చదవండి

కొత్త ట్రెండ్ .. అబ్బాయిలతో హగ్గుల కోసం ఎగబడుతున్న అమ్మాయిలు

55 ఏళ్ల మహిళతో ఎఫైర్..60 ఏళ్ల ఆమె భర్తను..

Updated Date - Jun 08 , 2025 | 11:39 AM