ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Rahul Gandhi: పాక్‌ దాడిలో అనాథలైన 22మంది చిన్నారులను దత్తత తీసుకోనున్న రాహుల్‌

ABN, Publish Date - Jul 30 , 2025 | 05:24 AM

కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ తన ఉదారతను చాటుకున్నారు. ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో పాక్‌ కాల్పులతో అనాథలైన చిన్నారుల బాధ్యతను తీసుకునేందుకు ముందుకొచ్చారు.

న్యూఢిల్లీ, జూలై 29: కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ తన ఉదారతను చాటుకున్నారు. ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో పాక్‌ కాల్పులతో అనాథలైన చిన్నారుల బాధ్యతను తీసుకునేందుకు ముందుకొచ్చారు. తల్లిదండ్రులు, కుటుంబాలను కోల్పోయిన పూంఛ్‌ జిల్లాకు చెందిన 22 మంది చిన్నారులను రాహుల్‌ దత్తత తీసుకోనున్నట్లు జమ్ముకశ్మీర్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ తరీఖ్‌ అహ్మద్‌ వెల్లడించారు. ఆ చిన్నారుల గ్రాడ్యుయేషన్‌ పూర్తయ్యేవరకు వారి విద్య, వైద్యం, ఇతర ఖర్చులన్నీ రాహుల్‌ చూసుకోనున్నట్లు చెప్పారు. త్వరలోనే వీరికి తొలి విడత సాయం అందజేస్తామని తెలిపారు.

ఇజ్రాయెల్‌పై మోదీ మౌనం వంచనే: సోనియా

న్యూఢిల్లీ, జూలై 29: గాజాపై ఇజ్రాయెల్‌ దాడులు మానవత్వాన్ని మంటగలుపుతున్నా మోదీ ప్రభుత్వం మౌన ప్రేక్షకురాలిగా ఉండటం గర్హనీయమని సోనియాగాంధీ అన్నారు. ఇది రాజ్యాంగ విలువల పట్ల వంచనాత్మక విద్రోహమని ఆమె దుయ్యబట్టారు. మోదీ లజ్జాపూరిత మౌనం, తారస్థాయికి చేరిన నైతిక వంచన తీవ్ర నిరాశకు గురిచేస్తున్నాయని ‘దైనిక్‌ జాగరణ్‌’ అనే హిందీ పత్రికకు రాసిన వ్యాసంలో సోనియా పేర్కొన్నారు. అమాయక ఇజ్రాయెలీలపై హమాస్‌ జరిపిన అనాగరిక దాడులను సమర్థించాల్సి అవసరం లేదన్నారు. కానీ, ఆ దాడులకు ప్రతిస్పందనగా గాజాపై ఇజ్రాయెల్‌ జరుపుతున్న దాడులను కేవలం విపరీత చేష్టలుగా చూడలేమని, అది కచ్చితంగా హంతక నేరమేనని సోనియా స్పష్టం చేశారు. బలహీనుల పక్షం వహించి వారి హక్కుల కోసం గట్టిగా మాట్లాడిన ఉజ్వల చరిత్ర భారత్‌కు ఉన్నదని, ఆ వారసత్వాన్ని కొనసాగించాలని మోదీకి సోనియా సూచించారు.

ఈ వార్తలు కూడా చదవండి

సుప్రీంకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి ఊరట

హైదరాబాద్ అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్ ఫోకస్

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 30 , 2025 | 05:24 AM