Puri Jagannath Temple: పూరీ జగన్నాథ ఆలయంలో కీలక మార్పు.. రత్నభండార్ తెరచేందుకు కసరత్తు
ABN, Publish Date - Aug 15 , 2025 | 08:38 PM
పూరీ జగన్నాథ ఆలయంలోని జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రల ఆభరణాలను రత్నాభాండాగారంలో భద్రపరుస్తుంటారు. అనేక మంది రాజులు, భక్తులు సమర్పించిన విలువైన కానుకలను ఇందులో దాచిపెట్టారని చెబుతారు.
పూరీ: ఒడిశాలో 12వ శతాబ్దానికి చెందిన ప్రఖ్యాత పూరీ జగన్నాథ ఆలయానికి సంబంధించి కీలక మార్పు జరుగనుంది. వారంలోగా శ్రీ జగన్నాథ్ టెంపుల్ మేనేజింగ్ కమిటీ (SJTMC)ని పునర్వ్యవస్థీకరించనున్నట్టు రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఫృధ్వీరాజ్ హరిచందన్ తెలిపారు. స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా పూరీలో శుక్రవారంనాడు త్రివర్ణ పతాకం ఎగురవేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
టెంపుల్ మేనేజిమెంట్ కమిటీ పునర్వ్యవస్థీకరణతో రత్నాభండార్ (ట్రెజరీ)లో విలువైన కానుకుల జాబితా తయారీకి మార్గం సుగమమవుతుందని చెప్పారు. ఇది భక్తుల చిరకాల డిమాండ్‌గా ఉందని అన్నారు. రాబోయే మూడు నుంచి ఐదు రోజుల్లో కానీ, గరిష్టంగా వారం రోజుల్లో కానీ కమిటీ పునర్వ్యవస్థీకరణ జరుగుతుందన్నారు. అనంతరం రత్నాభండాగార్‌లోని ఆభరణాల జాబితా తయారీ ప్రక్రియ మొదలవుతుందని చెప్పారు. జాబితా ప్రక్రియ కోసం ఇద్దరు నిపుణులను ఆర్బీఐ నియమించిన్టటు చెప్పారు.
ఎస్‌జేటీఎంసీలో 18 మంది సభ్యులుంటారని, వారిలో 10 మందిని ప్రభుత్వం నియమిస్తుందని మంత్రి తెలిపారు. గజపతి మహరాజ్ దిబ్యసింహ్ దేబాతో సహా తక్కిన వారు ఎక్స్ అఫీసియో సభ్యుగా ఉంటారని తెలిపారు. 2024 సెప్టెంబర్ 2న గత సభ్యుల పదవీకాలం ముగిసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సభ్యుల నియామకం జరపలేదు.
పూరీ జగన్నాథ ఆలయంలోని జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రల ఆభరణాలను రత్నాభాండాగారంలో భద్రపరుస్తుంటారు. అనేక మంది రాజులు, భక్తులు సమర్పించిన విలువైన కానుకలను ఇందులో దాచిపెట్టారని, వీటి విలువ వేలకోట్లలో ఉంటుందని, కొన్ని దశాబ్దాలుగా ఆలయ ఖజానా లోపలి గది తెరవలేదని చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి..
నాగాలాండ్ గవర్నర్ గణేశన్ కన్నుమూత
కూలిన హుమాయూన్ సమాధి గోపురం, ఆరుగురు మృతి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Aug 15 , 2025 | 09:39 PM