La Ganesan: నాగాలాండ్ గవర్నర్ గణేశన్ కన్నుమూత
ABN , Publish Date - Aug 15 , 2025 | 09:15 PM
నాగాలాండ్ గవర్నర్ గణేశన్ మృతికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. గణేశన్ జాతీయవాది అని, ప్రజాసేవ, జాతి నిర్మాణానికి తమ జీవితాన్ని అంకితం చేశారని ప్రధాని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో పేర్కొన్నారు.
చెన్నై: నాగాలాండ్ గవర్నర్ గణేశన్ (La Ganesan) కన్నుమూశారు. ఆయన వయసు 80 సంవత్సరాలు. చెన్నైలోని ఒక ప్రైవేటు ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి ఆయన కన్నుమూసినట్టు రాజ్‌భవన్ అధికారులు తెలిపారు. ఈనెల 8న ఆయన చెన్నైలోని తన నివాసంలో కుప్పకూలడంతో తలకు గాయమైంది. దీంతో ఆయనను వెంటనే ఆసుపత్రిలో చేర్చారు.
మోదీ సహా పలువురు ప్రముఖుల సంతాపం
నాగాలాండ్ గవర్నర్ గణేశన్ మృతికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. గణేశన్ నిజమైన జాతీయవాది అని, ప్రజాసేవ, జాతి నిర్మాణానికి తమ జీవితాన్ని అంకితం చేశారని ప్రధాని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో పేర్కొన్నారు. తమిళనాడులో బీజేపీ బలోపేతానికి ఎంతో కృషి చేశారని, తమిళ సంస్కృతిని ఆయన ఎంతగానో ఇష్టపడేవారని అన్నారు. గవర్నర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గణేశన్ మృతి తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని నాగాలాండ్ ఉప ముఖ్యమంత్రి యంతుంగో పాటన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా జీవితంలో ఆయన ఎంతో హుందాగా వ్యవహరించేవారని, నిరంతరం ప్రజాసంక్షేమానికి కట్టుబడి పనిచేశారని గుర్తుచేసుకున్నారు.
గణేశన్ 1945 ఫిబ్రవరి 16న తంజావూరులో జన్మించారు. ఆర్‌ఎస్ఎస్ భావజాలంతో ఆకర్షితులైన ఆయన 20 ఏళ్లు సంఘ్‌లో సేవలందించారు. తమిళనాడులో బీజేపీ బలోపేతానికి కృషి చేశారు. ఆ రాష్ర్ర బీజేపీ అధ్యక్షుడిగా 2006-2009 మధ్య పని చేశారు. ఆ తర్వాత మణిపూర్ గవర్నర్‌గా, పశ్చిమబెంగాల్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు చేపట్టారు. నాగాలాండ్ 21వ గవర్నర్‌గా గణేశన్ 2023 ఫిబ్రవరి 20న పదవీ బాధ్యతలు చేపట్టారు.
ఇవి కూడా చదవండి..
శ్రీకృష్ణుడి స్ఫూర్తితో సుదర్శన్ చక్ర.. ఎర్రకోట వేదికగా మోదీ
ఎర్రకోటకు వెళ్లని రాహుల్, ఖర్గే.. కారణం ఇదేనా?..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి