ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Pulwama Attack: పుల్వామా ఉగ్రదాడి మా పనే

ABN, Publish Date - May 12 , 2025 | 04:46 AM

పుల్వామా ఉగ్రదాడికి పాక్‌ సంబంధం లేదన్న వాదన బూటకమని, పాకిస్తాన్‌ ఎయిర్‌ మార్షల్‌ తాజా వ్యాఖ్యలు మరోసారి బహిర్గతం చేశాయి. జేషే మహ్మద్‌ దాడులకు తలమానికంగా, పాక్‌ నాయకులే దానిని వ్యూహాత్మక విజయంగా సమర్ధించడమే ఆ దేశ ఉగ్ర మద్దతును రుజువు చేస్తోంది.

2019 నాటి దాడి పాకిస్థాన్‌ ‘వ్యూహాత్మక ప్రతిభ’

మా దేశ రక్షణలో రాజీలేదు: పాక్‌ ఎయిర్‌ వైస్‌ మార్షల్‌ అహ్మద్‌

మరోసారి బయటపడ్డ దాయాది కపట నాటకాలు

ఇస్లామాబాద్‌/న్యూఢిల్లీ, మే 11: పాకిస్థాన్‌ వక్రబుద్ధి, కపట నాటకం మరోసారి బహిర్గతమైంది. ఉగ్రవాదులతో తమకు లింకులులేవని, భారత్‌లో జరిగిన ఉగ్రదాడులతో తమకు సంబంధంలేదని ఎప్పుడూ అలవాటుగా చెప్పే మాటలు బూటకమని వెల్లడైంది. 2019లో జరిగిన పుల్వామా దాడిలో పాక్‌ హస్తం ఉందని తాజాగా ఆ దేశ వాయుసేన అధికారి ఒక విధంగా అంగీకరించారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ అనంతరం శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో పాకిస్థాన్‌ ఎయిర్‌ వైస్‌ మార్షల్‌ ఔరంగజేబు అహ్మద్‌ మాట్లాడుతూ పుల్వామా దాడిని పాక్‌ ‘వ్యూహాత్మక ప్రతిభ’గా పేర్కొన్నారు. పలు విదేశీ మీడియా ప్రతినిధుల సమక్షంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యల వీడియో సోషల్‌మీడియాలో వైరలైంది. ‘పాకిస్థాన్‌ భూభాగం, గగనతలం, నీరు లేదా దేశ ప్రజలకు ముప్పు కలిగితే.. ఆ విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదు. మేం మా దేశానికి కట్టుబడి ఉంటాం. పాక్‌ ప్రజలు తమ సాయుధ దళాలపై కలిగివున్న గర్వాన్ని, విశ్వాసాన్ని మేం ఎల్లప్పుడూ నిలబెట్టుకుంటాం. ఈ విషయన్ని పుల్వామాలో తమ వ్యూహాత్మక ప్రతిభ ద్వారా తెలియజేయడానికి ప్రయత్నించాం. ఇప్పుడు మా కార్యదక్షత, వ్యూహాత్మక చతురత, నైపుణ్యాలను ప్రదర్శించాం.


వారు గమనించారని అనుకుంటున్నాను’ అని ఆహ్మద్‌ వ్యాఖ్యానించారు. ఈ మీడి యా సమావేశంలో డీజీఐఎ్‌సపీఆర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ అహ్మద్‌ షరీఫ్‌ చౌదరి, నేవీ అధికార ప్రతినిధి ఉన్నారు. కాగా, పుల్వామా దాడిని పాక్‌ అంగీకరించడం అరుదే అయినా ఇదే తొలిసారి కాదు. గతంలో 2020లో అప్పటి పాక్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రి ఫవద్‌ చౌదురి పుల్వామా ఉగ్రదాడికి పాకిస్థాన్‌ కారణమని బహిరంగంగా అంగీకరించారు. ఈ రెచ్చగొట్టే చర్య భారత్‌తో యుద్ధం అంచు వరకు తీసుకెళ్లిందన్నారు. పాక్‌ నేషనల్‌ అసెంబ్లీలో ఫవద్‌ చౌదురి మాట్లాడుతూ ‘మేం భారత్‌ను వారి దేశంలోనే కొట్టాం. పుల్వామాలో మనం సాధించిన విజయం.. ఇమ్రాన్‌ ఖాన్‌ నాయకత్వంలో దేశానికి సాధించిన విజయం’ అని పేర్కొన్నారు. కాగా పాకిస్థాన్‌ కేంద్రంగా పనిచేసే ఉగ్రసంస్థ జేషే మహ్మద్‌ 2019లో పుల్వామాలో సీఆర్‌పీఎఫ్‌ కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడికి పాల్పడింది. ఈ దారుణ ఘటనలో 40మంది పారామిలటరీ జవాన్లు మరణించారు. ఈ ఘటనలో తమ పాత్ర ఏమీ లేదని పాకిస్థాన్‌ అప్పటి నుంచి ఇప్పటి వరకు చెప్పుకుంటూ వస్తోంది. పహల్గాం దాడి విషయంలోనూ పాక్‌ వైఖరి ఇదేవిధంగా ఉంది. అయితే పాకిస్థాన్‌ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తోందన్న ఆరోపణలను ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ ఇటీవల ధ్రువీకరించడం గమనార్హం.


Read Also: Ranveer Allahbadia: ఆపరేషన్ సిందూర్.. అనవసర పోస్టు పెట్టి చిక్కుల్లో పడ్డ రణవీర్ అల్లాహ్‌బాదియా

Operation Sindoor: ఉగ్రవాదుల అంతమే ఆపరేషన్ సింధూర్ లక్ష్యం.. భారత సైన్యం
Operation Sindoor: ఆర్మీ కమాండర్లకు ఫుల్ పవర్

Updated Date - May 12 , 2025 | 04:46 AM