ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Chennai: రామేశ్వరంలో.. ఆలయ ముట్టడికి భక్తుల యత్నం

ABN, Publish Date - Jun 18 , 2025 | 12:33 PM

రామేశ్వరం ఆలయం వద్ద స్థానికులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలు ఆలయ ముట్టడికి దిగారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రామేశ్వరం రామనాథస్వామి ఆలయానికి రోజూ దేశం నలుమూలల నుండి వేల సంఖ్యలో భక్తులు వస్తున్నారు.

చెన్నై: రామేశ్వరం(Rameshwaram) ఆలయం వద్ద స్థానికులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలు ఆలయ ముట్టడికి దిగారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రామేశ్వరం రామనాథస్వామి ఆలయానికి(Rameshwaram Ramanathaswamy Temple) రోజూ దేశం నలుమూలల నుండి వేల సంఖ్యలో భక్తులు వస్తున్నారు. భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడంతో స్థానికులు ఆ ఆలయంలో సులువుగా దైవదర్శనం చేయలేకపోతున్నారు. ఈ కారణంగా కొన్ని దశాబ్దాలకు పూర్వమే రామేశ్వరం ఆలయంలో స్థానికులకు ప్రాధాన్యం కల్పించే వారి కోసం ప్రత్యేకంగా క్యూలైన్‌ ఉండేది.

ఆ క్యూలైన్‌లో వెళ్ళి స్థానికులు సులువుగా దర్శనం చేసుకునేవారు. ఈ నేపథ్యంలో ఆ ఆలయానికి డిప్యూటీ కమిషనర్‌ చెల్లదురై బాధ్యతలు చేపట్టినప్పటి నుండి స్థానికుల క్యూలైన్‌ తొలగించారు. స్థానికులు ధర్మదర్శనం (సర్వదర్శనం) క్యూలైన్‌లోనే రావాలని ఉత్తర్వు జారీ చేశారు. దీంతో ఆలయ నిర్వాహకులపై స్థానికులు, రాజకీయ పార్టీల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు ఇటీవల రాజీ చర్చలు కూడా జరిగాయి. కానీ ఆలయ అధికారులు గతంలా ప్రత్యేక క్యూలైన్‌లో స్థానికులను అనుమతించే ప్రసక్తే లేదంటూ ప్రకటించారు.

ఈ నిర్ణయాన్ని ఖండిస్తూ మంగళవారం ఉదయం రామేశ్వరం నగరంలోని ప్రజలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఆలయాన్ని ముట్టడించేందుకు ర్యాలీ నిర్వహించారు. ఈ విషయం ముందుగానే తెలుసుకున్న పోలీసులు ఆలయం చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో వేల సంఖ్యలో స్థానికులు ఆలయ ప్రధాన ప్రవేశ ద్వారం వైపు దూసుకొచ్చారు. ఆ సందర్భంగా పోలీసులకు, స్థానికులకు మధ్య తొక్కిసలాట జరిగింది. అదే సమయంలో స్థానికులు పోలీసులకు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ ప్రదర్శన కారణంగా ఆలయం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.

ఈ వార్తలు కూడా చదవండి.

ఇంజనీరింగ్‌లో మళ్లీ ‘నచ్చిన సబ్జెక్టులు’!

సౌర విద్యుత్‌పై అవగాహన పెంచాలి

Read Latest Telangana News and National News

Updated Date - Jun 18 , 2025 | 12:33 PM