DMDK Premalatha: విద్యుత్ ఛార్జీలు పెంచడం సబబు కాదు..
ABN, Publish Date - Jul 03 , 2025 | 11:44 AM
రాష్ట్రప్రజలపై మరింత ఆర్థిక భారం మోపేలా విద్యుత్ ఛార్జీలు పెంచడం సరికాదని, ప్రభుత్వం దీనిని తక్షణం వాపసు తీసుకోవాలని డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత(Premalatha) డిమాండ్ చేశారు.
- డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత
చెన్నై: రాష్ట్రప్రజలపై మరింత ఆర్థిక భారం మోపేలా విద్యుత్ ఛార్జీలు పెంచడం సరికాదని, ప్రభుత్వం దీనిని తక్షణం వాపసు తీసుకోవాలని డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత(Premalatha) డిమాండ్ చేశారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, విద్యుత్ ఛార్జీలు పెంచే ఉద్దేశం తమ ప్రభుత్వానికి లేదని ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin) హామీ ఇచ్చారని,
ఇప్పటికే ధరల పెంపుతో తల్లడిల్లుతున్న పేద, మధ్య తరగతి కుటుంబాలపై మరింత ఆర్థిక భారం మోపేలా రాష్ట్రంలో మంగళవారం అర్థరాత్రి నుండి విద్యుత్ ఛార్జీలను పెంచారని ఆరోపించారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను ఉపసంహరించుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి.
12వ తరగతి బాలుడితో టీచరమ్మ బలవంతపు శృంగారం!
రేవంత్.. తెలంగాణకు పట్టిన అబద్ధాల వైరస్!
Read Latest Telangana News and National News
Updated Date - Jul 03 , 2025 | 11:44 AM