ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Prashant Kishor: ప్రశాంత్ కిషోర్‌పై పరువునష్టం కేసు

ABN, Publish Date - Jun 03 , 2025 | 06:23 PM

అశోక్ చౌదరి తన కుమార్తెకు లోక్‌సభ సీటు సంపాదించేందుకు కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్‌కు డబ్బులు ఇచ్చారంటూ ప్రశాంత్ కిషోర్ ఆరోపించినట్టు తెలుస్తోంది.

పాట్నా: ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ (Jan Suraaj) పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) లీగల్ చిక్కుల్లో పడ్డారు. ఆయనపై బీహార్ మంత్రి, జేడీయూ సీనియర్ నేత అశోక్ చౌదరి మంగళవారంనాడు పరువునష్టం కేసు వేశారు. అశోక్ చౌదరి తన కుమార్తెకు లోక్‌సభ సీటు సంపాదించేందుకు కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్‌కు డబ్బులు ఇచ్చారంటూ ప్రశాంత్ కిషోర్ ఆరోపించినట్టు తెలుస్తోంది. దీనిపైనే చౌదరి పరువునష్టం కేసు వేశారు. చౌదరి కుమార్తె శాంభవి లోక్‌ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) సమస్టిపూర్ రిజర్వ్‌డ్ నియోజకవర్గం ఎంపీగా ఉన్నారు.


ప్రశాంత్ కిషోర్ తనపైన, తన కుమార్తె పైన అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో లీగల్ నోటీసు పంపానని, ఆయన పంపిన సమాధానం సంతృప్తికరంగా లేదని, ఆయనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని చాలా స్పష్టంగా తేలిందని చౌదరి చెప్పారు. అందుకే లీగల్ చర్యలకు దిగినట్టు తెలిపారు. చిరాగ్ పాశ్వాన్‌కు తాను డబ్బులిచ్చినట్టు ప్రశాంత్ కిషోర్ నిరూపించడం కానీ, తన ఆరోపణలను ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పడం కానీ చేయాలని అన్నారు. దీనిపై అవసరమైతే సుప్రీంకోర్టు వరకూ వెళ్తానని చౌదరి స్పష్టం చేశారు.


ప్రశాంత్ కిషోర్ ఇంతకుముందు పోల్ స్ట్రాటజిస్ట్‌గా జేడీయూతో కొద్దికాలం పనిచేశారని, పొలిటకల్ ట్రేడర్‌గా డబ్బులు తీసుకుని ఆయన పలు పార్టీలకు సేవలందించారని చౌదరి గుర్తుచేశారు. అయితే తాము మాత్రం పూర్తిగా రాజకీయాల్లో ఉన్నామని, తాను రెండో తరం పొలిటీషియన్‌నని చెప్పారు. తన కుమార్తె అతి చిన్న వయస్సులో ఎంపీ అయ్యారని అన్నారు. దళిత అమ్మాయికి ఇలాంటి గౌరవం దక్కడం ప్రశాంత్ కిషోర్ జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పారు. చౌదరి తండ్రి మహావీర్ చౌదరి తండ్రి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేశారు.


ఇవి కూడా చదవండి..

తప్పు చేసి భద్రత కోరుతున్నారా? కమల్‌పై కర్ణాటక హైకోర్టు ఫైర్..

శర్మిష్ఠ పనోలికి బెయిల్ నిరాకరించిన కోల్‌కతా హైకోర్టు

For National News And Telugu News

Updated Date - Jun 03 , 2025 | 06:25 PM