Pahalgam Attack: రెండు నెలలు ఆహారం నిల్వ చేసుకోండి.. పౌరులను కోరిన పీఓకే
ABN, Publish Date - May 02 , 2025 | 04:36 PM
ఆహార పదార్ధాలు, మెడిసన్లు, ఇతర కనీస అవసరాల సరఫరాకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా రూ.100 కోట్ల అత్వసర నిధిని పీఓకే ప్రభుత్వం ఏర్పాటు చేసినట్టు హక్‌ను ఉటంకిస్తూ అరబ్ న్యూస్ ఒక కథనంలో పేర్కొంది.
న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి అనంతరం ఇండియా-పాక్ మధ్య ఉద్రికతలు పెరుగుతున్న నేపథ్యంలో ముందుజాగ్రత్తగా ఆహార పదార్ధాలను నిల్వ చేసుకోవాల్సిందిగా పౌరులను పాక్ ఆక్రమిత కశ్మీర్ (POK) కోరినట్టు మీడియా వర్గాలు తెలిపాయి. లోకల్ అసెంబ్లీని ఉద్దేశించి పీఓకే ప్రధానమంత్రి చౌదరి అన్వర్ అల్ హక్ ప్రసంగిస్తూ, ఎల్ఓసీ వెంబడి 13 నియోజకవర్గాల్లో రెండు నెలల పాటు ఆహార పదార్ధాలు నిల్వ చేసుకోవాలని పీఓకేలోని ప్రజలకు ఆదేశాలిచ్చినట్టు సమాచారం.
Supreme Court: పాక్ వెళ్లిపోవాలన్న ఆదేశాలపై యాక్సెంచర్ ఉద్యోగికి సుప్రీంకోర్టు ఊరట
ఆహార పదార్ధాలు, మెడిసన్లు, ఇతర కనీస అవసరాల సరఫరాకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా రూ.100 కోట్ల అత్వసర నిధిని పీఓకే ప్రభుత్వం ఏర్పాటు చేసినట్టు హక్‌ను ఉటంకిస్తూ అరబ్ న్యూస్ ఒక కథనంలో పేర్కొంది.
కాగా, పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ బుధవారంనాడు గిల్గిట్, స్కర్దు సహా పీఓకేలోని ప్రాంతాలకు రాకపోకలు సాగించే అన్ని విమానాలను భద్రతా కారణాల రీత్యా రద్దు చేసినట్టు మీడియా కథనాలు వెలువడ్డాయి. కరాచీ, లాహోర్ నుంచి స్కర్దుకు వెళ్లే రెండు విమానాలు, ఇస్లామాబాద్ నుంచి స్కర్దు వెళ్లే రెండు విమానాలు, ఇస్లామాబాద్ నుంచి గిల్గిట్ వెళ్లే నాలుగు విమానాలు రద్దయినట్టు ఉర్దూ డెయిలీ జంగ్ తెలిపింది.
ఇవి కూడా చదవండి..
Pehalgam Terror Attack: కరడుకట్టిన ఉగ్రవాదులు వీళ్లే..
Pehalgam Terror Attack: కాందహార్ హైజాకర్ ఇంట్లో సోదాలు
Updated Date - May 02 , 2025 | 04:37 PM